Headphones : ఎయిర్‌ ప్యూరిఫైర్‌తో డైసన్‌ జోన్‌ హెడ్‌ఫోన్స్‌

ABN , First Publish Date - 2022-12-10T00:07:08+05:30 IST

స్వచ్ఛమైన గాలి కోసం ముఖ్యంగా పట్టణాల్లోని ప్రజలు తహతహలాడే రోజులివి. నగరాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో కమ్ముకుని ఉండే కాలుష్యం

Headphones : ఎయిర్‌ ప్యూరిఫైర్‌తో డైసన్‌ జోన్‌ హెడ్‌ఫోన్స్‌

స్వచ్ఛమైన గాలి కోసం ముఖ్యంగా పట్టణాల్లోని ప్రజలు తహతహలాడే రోజులివి. నగరాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో కమ్ముకుని ఉండే కాలుష్యం అందుకు కారణం. ఈ నేపథ్యంలో డైసన్‌ జోన్‌ - ఎయిర్‌ ప్యూరిఫైర్‌ లక్షణాలు కూడా ఉన్న హెడ్‌ఫోన్స్‌ను ఇండియన్‌ మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. సింగిల్‌ చార్జింగ్‌తో 50 గంటల సేపు బ్యాటరీలైఫ్‌ కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. బయట ఉన్నప్పుడు వీచేగాలి నుంచి స్వచ్ఛత కోరుకుంటే నాలుగు గంటల సేపు రన్‌ టైమ్‌ ఉంటుంది. యూబీసీ-సీ చార్జింగ్‌ పోర్టుతో మూడు గంటల్లో వంద శాతం చార్జింగ్‌ పూర్తవుతుంది. అలా్ట్రలో డిసార్షన్‌ అడ్వాన్స్‌డ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌కు తోడు ఫుల్‌ స్పెక్ట్రమ్‌ ఆడియో రిప్రొడక్షన్‌ కలిగి ఉంది. 40ఎంఎం నియోడైమియమ్‌ స్పీకర్‌ డ్రైవర్స్‌ ఉన్నాయి. సెకనుకు 48000 రెట్ల మేరకు ఇంటెలిజెంట్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌తో సమానంగా డ్రైవర్‌ ఔట్‌పుట్‌ ఉంటుంది. ఆడియో అనుభవం బాగా ఉండేందుకు సైంటిఫిక్‌ అప్రోచ్‌ని డైసన్‌ ఇంజనీర్లు అమలుచేశారు. దీంట్లో పదకొండు మైక్రోఫోన్లు ఉండగా, ఎనిమిదింటిని అచ్చంగా నాయిస్‌ కాన్సిలేషన్‌ ఫీచర్‌ ఉపయోగించుకుంటోంది. ఈ ఫీచర్‌ చుట్టుపక్కల సెకనుకు రమారమి నాలుగు లక్షల రెట్ల మేర శబ్దాలను మానిటర్‌ చేస్తుంది. అమెరికాలో దీని రేటు సుమారు రూ.78,000 కాగా మన దేశీయ మార్కెట్లోకి వచ్చే ఏడాది మొదటి క్వార్టర్లో రానుంది.

Updated Date - 2022-12-10T00:07:09+05:30 IST