Curremt Bill : కరెంటు బిల్లు తగ్గించుకోండిలా...

ABN , First Publish Date - 2022-11-11T22:56:22+05:30 IST

పగటి పూట ఇంట్లోని కిటికీల కర్టెయిన్లు, తలుపులు తెరిస్తే వెలుగు వస్తుంది. ముఖ్యంగా ఎల్‌ఈడీ బల్బులు కొనడం మంచిది.

Curremt Bill : కరెంటు బిల్లు   తగ్గించుకోండిలా...

పగటి పూట ఇంట్లోని కిటికీల కర్టెయిన్లు, తలుపులు తెరిస్తే వెలుగు వస్తుంది. ముఖ్యంగా ఎల్‌ఈడీ బల్బులు కొనడం మంచిది. ఎందుకంటే దీని వల్ల 70 శాతం కరెంటు ఆదా చేయవచ్చు. మామూలు బల్బులతో పోలిస్తే 15 రెట్లు మన్నిక ఎక్కువ. గదిలో మనిషి లేనప్పుడు టీవీ, ఫ్యాన్లు వేయకూడదు. తెలీకుండా ఇదే కరెంటు బిల్లును పెంచుతుంది.

ఫ్రిజ్‌ గోడకు దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా ఉంచటం వల్ల గాలి బాగా తగులుతుంది. దీని వల్ల కరెంటు ఖర్చు ఎక్కువ కాదు. ఇక ఫ్రిజ్‌లో ఖాళీగా ఉంచకుండా కూరగాయలు, ఆకుకూరలు ఉంచాలి. నార్మల్‌ మోడల్‌లోనే ఫ్రిజ్‌ను ఉంచాలి. ఇక వేడినీళ్లను, వేడి పదార్థాలను ఫ్రిజ్‌లో పెడితే కరెంటు వినియోగం ఎక్కువ అవుతుంది. పదే పదే ఫ్రిజ్‌ డోర్‌ తీయటం వల్ల కూడా కరెంటు ఖర్చు అవుతుంది.

వేడి నీళ్లకోసం ఉపయోగించే గీజర్‌ పదే పదే వేయటం వల్ల కరెంటు బిల్లు అధికంగా వస్తుంది. ముఖ్యంగా ఎలక్ర్టానిక్‌ వస్తువులు బ్రాండెడ్‌ కొనాలి. ఎప్పుడూ స్టార్‌ రేటింగ్‌ చూసే కొనాలి. స్టార్‌ రేటింగ్‌ ఎక్కువ ఉంటే కరెంటు ఆదా ఆవుతుంది.

వాషింగ్‌మెషీన్‌లో లోడ్‌ కెపాసిటీ కంటే ఎక్కువ బట్టలు వేయటంలాంటివి చేయకూడదు. ఛార్జింగ్‌ ప్లగ్‌లు పెట్టి ఉంచిన మెయిన్‌ స్విచ్‌ను నిద్రపోయే ముందు ఆఫ్‌ చేయాలి. ఇలాంటివి చిన్న చిన్న పనులు చేస్తే విద్యుత్‌ వినియోగం తగ్గి కరెంటు బిల్లు తగ్గుతుంది.

Updated Date - 2022-11-11T22:56:22+05:30 IST