హెపటైటిస్‌, హెర్పిస్‌లకు చెక్‌

ABN , First Publish Date - 2022-12-05T23:14:18+05:30 IST

హెపటైటిస్‌... ఈ మధ్యకాలంలో చాలా మందిని భయపెడుతున్న వైరస్‌ ఇది. ఇతర జబ్బులకు చికిత్స కోసం వెళ్లినపుడు, అనుకోకుండా చేసిన పరీక్షల్లో హెపటైటిస్‌ ఉన్నట్లు బయటపడుతుంది.

హెపటైటిస్‌, హెర్పిస్‌లకు చెక్‌

హెపటైటిస్‌... ఈ మధ్యకాలంలో చాలా మందిని భయపెడుతున్న వైరస్‌ ఇది. ఇతర జబ్బులకు చికిత్స కోసం వెళ్లినపుడు, అనుకోకుండా చేసిన పరీక్షల్లో హెపటైటిస్‌ ఉన్నట్లు బయటపడుతుంది. దాంతో ఇక తమ జీవితం ముగిసినట్లేనని నిర్ధారణకు వస్తారు. ఈ వైరస్‌ శరీరంలో నుంచి పూర్తిగా పోదని, దీర్ఘకాలంలో కాలేయం దెబ్బతినే అవకాశం కూడా ఉందని వైద్యులు చెప్పడంతో వాళ్లు ఆ నిర్ణయానికి వస్తారు. నిజానికి హెపటైటిస్‌ వైరస్‌ను కట్టడి చేసే మందులు హోమియోలో ఉన్నాయి. హెపటైటిస్‌ ఉందని నిర్ధారణ అయ్యాక భయపడకుండా హోమియో వైద్యం తీసుకుంటే ఆరోగ్యవంతమైన జీవితం గడిపే అవకాశం దక్కుతుంది.ఆకలి వాంతులు వచ్చినట్లు అనిపించడం, ఒళ్లంతా నొప్పులు, మూత్రం పచ్చగా రావడం, కామెర్లు, చర్మంపైన దద్దుర్లు రావడం జరుగుతుంది. కడుపులో ఉబ్బరంగా ఉండటం, పొట్టలో నొప్పి వంటి లక్షణాలన్నీ హోమియో మందులతో దూరమవుతాయి.

హెర్పిస్‌ సింప్లెక్స్‌: పురుషాంగంపైన చెమట పొక్కులు మాదిరిగా నీటి పొక్కులు కనిపిస్తాయి. సాధారణ పొక్కులే కదా అని వాటిని నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఆ నీటి పొక్కులు పగిలి ఎర్రగా పుండు మాదిరిగా తయారవుతాయి. పురుషుల్లోనే కాకుండా స్ర్తీలలో కూడా యోని మీద చిన్న చిన్న పొక్కులలాగా వచ్చి ఎర్రగా మారి విపరీతమైన నోప్పి ఉంటుంది. ఈ సమస్యకు చికిత్స తీసుకోకుండా వదిలేస్తే అనేక ఇతర సమస్యలకు దారి తీస్తుంది. అయితే హెర్పిస్‌ సమస్యకు హోమియో అద్భుతంగా పనిచేస్తుంది. హోమియో చికిత్స అనంతరం వ్యాధి మళ్లీ తిరగబెట్టడం ఉండదు.

Updated Date - 2022-12-05T23:14:20+05:30 IST