బాడీకాన్‌ క్వీన్స్‌!

ABN , First Publish Date - 2022-01-03T05:30:00+05:30 IST

కథానాయికలంటే బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌గా ఉండాల్సిందే. ఇపుడు హాలీవుడ్‌, బాలీవుడ్‌లో బాడీకాన్‌ దుస్తులు నయా ట్రెండ్‌. ..

బాడీకాన్‌ క్వీన్స్‌!

కథానాయికలంటే బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌గా ఉండాల్సిందే. ఇపుడు హాలీవుడ్‌, బాలీవుడ్‌లో బాడీకాన్‌ దుస్తులు నయా ట్రెండ్‌. శరీర సౌష్టవాన్ని మరింత అందంగా చూపించే ఈ దుస్తుల్లో బయట కనిపిస్తున్నారు కొందరు హీరోయిన్స్‌. బాడీకాన్‌ డ్రెస్సులని ధరించే బ్యూటీక్వీన్స్‌ గురించి..


హాలీవుడ్‌లో జెన్నిఫర్‌ లోపేజ్‌, జెన్నిఫర్‌ అనిస్టన్‌, కిమ్‌ కర్దాషియన్‌ లాంటి కథానాయికలు బాడీకాన్‌ డ్రెస్సులకి బ్రాండ్‌ అంబాసిడర్‌లా మారారిప్పుడు. ఫంక్షన్లకు, పుట్టినరోజు పార్టీల్లో.. ఈ మధ్య కాలంలో హాలీవుడ్‌లో ఎక్కువగా ఈ దుస్తులను ధరిస్తున్నారు. ‘ఇది పర్ఫెక్ట్‌ అవుట్‌ఫిట్‌. టైమ్‌లెస్‌ అప్పీల్‌. కర్వ్స్‌ సహజంగా కనిపిస్తాయి. బాడీషేప్‌ను మరింత అందంగా చూపించే బాడీకాన్‌ డ్రెస్సులను వింటర్‌ సీజన్‌లో హీరోయిన్స్‌, మోడల్స్‌ ధరిస్తుంటార’ని డిజైనర్‌ అయినా మహాజన్‌ అంటున్నారు.


బాలీవుడ్‌లో ట్రెండ్‌.. 

ఇటీవలే నీలం, తెలుపు రంగు ఉండే బాడీటోన్‌ డ్రెస్‌తో పాటు జడతో ఫొటోలకు ఫోజిచ్చింది ప్రియాంకచోప్రా. హాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉండే ప్రియాంక హాలీవుడ్‌ లుక్స్‌కోసం ఈ డ్రెస్‌ ధరిస్తూ ఉంటుంది. ఇటీవల ధరించిన ఈ బాడీకాన్‌ డ్రస్‌ ధర లక్షరూపాయలు. అందరికంటే ఎక్కువగా బాడీకాన్‌ దుస్తులను ధరించేది కత్రినా కైఫ్‌. ఈ బాలీవుడ్‌ బ్యూటీ పార్టీలు, ఫంక్షన్లలో ఎక్కువగా ఈ దుస్తుల్లోనే దర్శనమిస్తుంటుంది. ఇటీవలే జాహ్నవి కపూర్‌ ‘83’ మూవీ ప్రీమియర్‌లో బాడీకాన్‌ డ్రెస్‌లో డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపించింది. సారా అలీఖాన్‌, క్రితి సనన్‌, అనన్య పాండే, అలియాబట్‌ లాంటి కుర్రహీరోయిన్లు కూడా ఈ దుస్తుల్లో జిగేల్‌మంటున్నారు. 


ఇప్పుడిప్పుడే..

‘కరోనా పరిస్థితుల తర్వాత ఫ్యాషన్‌ లవర్స్‌, హీరోయిన్లు ఈ కంఫర్ట్‌ ఫిట్స్‌ను ధరిస్తున్నార’ని డిజైనర్‌ జాస్మిన్‌ అంటోంది. ఎరుపు, నలుపు, పసుపు పచ్చ, పింక్‌ రంగులను ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఫ్యాషన్‌ లవర్స్‌. ఈ డ్రెస్‌ను మెయిన్‌టెన్‌ చేసేవాళ్లు క్యాజువల్‌ పార్టీలకు ధరించటం కామన్‌ అయిందీ రోజుల్లో.  


ఇదీ బాడీకాన్‌ నేపథ్యం!

శరీరానికి అతుక్కుని ఉండి గౌనులా ఒకే పీస్‌తో తయారైన స్ర్టెచ్‌ మెటీరియల్‌ డ్రెస్సునే బాడీకాన్‌ డ్రెస్‌ అంటారు. ఈ కల్చర్‌ ఇప్పుడొచ్చింది కాదు. బాడీకాన్ఫిడెన్స్‌, బాడీ కాన్సియస్‌ పదాలనుంచి పుట్టిందే ‘బాడీకాన్‌’ డ్రెస్‌. యూరోపియన్లు చాలా ఏళ్ల క్రితమే ఇలాంటి దుస్తులు ధరించేవారట. బాడీకాన్‌ అనే పదం జపాన్‌ దేశంలోంచి పుట్టింది. బాడీకాన్‌ ట్రెండ్‌ అప్పుడప్పుడూ, కొందరు హీరోయిన్లు ధరించినప్పుడు కొత్తగా అనిపిస్తుంటుందంతే. Read more