తల్లయ్యాక కష్టమే!

ABN , First Publish Date - 2022-09-25T06:58:25+05:30 IST

అమ్మదనం ఆడవారికి మాత్రమే దక్కే అదృష్టం. ఓ బిడ్డకు జన్మ ఇవ్వడం అంటే... పునర్జన్మ ఎత్తడమే.

తల్లయ్యాక కష్టమే!

మ్మదనం ఆడవారికి మాత్రమే దక్కే అదృష్టం. ఓ బిడ్డకు జన్మ ఇవ్వడం అంటే... పునర్జన్మ ఎత్తడమే. ఆ అనుభూతిని అనుభవించింది కాజల్‌. ఇటీవల కాజల్‌ తల్లిగా మారిన సంగతి తెలిసిందే. గర్భం దాల్చాక సినిమాలకు దూరమైన కాజల్‌ ఇప్పుడు మళ్లీ వెండి తెరవైపు అడుగులేస్తోంది. ‘ఇండియన్‌ 2’లో కాజల్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే సెట్స్‌పై వెళ్లింది. కాజల్‌ కూడా త్వరలోనే చిత్రీకరణలో పాల్గొనబోతోంది. అందులో భాగంగా వర్కవుట్లు మొదలెట్టింది. ఆ అనుభవాల్ని ఇన్‌స్టాలో తన అభిమానులతో పంచుకొంది. తల్లయ్యాక వర్కవుట్లు చేయడానికి శరీరం సహకరించదని, అందుకోసం చాలా కష్టపడాలని చెప్పుకొచ్చింది కాజల్‌. గర్భం దాల్చాక ఆడవారి శరీరంలో చాలా మార్పులొస్తాయని, కొంతమంది త్వరగానే మామూలైపోతారని, తన విషయంలో మాత్రం కాస్త సమయం పడుతోందని చెప్పుకొచ్చింది. త్వరలోనే తాను మళ్లీ యధాస్థానానికి వస్తాననే ఆశాభావం వ్యక్తం చేసింది కాజల్‌. కాకపోతే.. తన సెకండ్‌ ఇన్నింగ్స్‌పై కాజల్‌ ధీమాగానే ఉంది. ఇప్పటికీ సినిమాలపై ఉన్న అభిమానం, ప్రేమ తగ్గలేదని, తనలో ఇంకా ప్రేక్షకులు చూడాల్సిన కోణాలు చాలానే ఉన్నాయని చెబుతోంది. సో.. ఈ ఇన్నింగ్స్‌ భారీగానే ప్లాన్‌ చేసిందన్నమాట.

Read more