Beautiful blouses: బ్యూటిఫుల్‌ బ్లౌజెస్‌

ABN , First Publish Date - 2022-12-13T22:38:28+05:30 IST

చీర అందం బ్లౌజ్‌ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి చీరకట్టును ఇనుమడింపజేసేలా బ్లౌజ్‌ను డిజైన్‌ చేయించుకుంటూ ఉండాలి.

Beautiful blouses: బ్యూటిఫుల్‌ బ్లౌజెస్‌

చీర అందం బ్లౌజ్‌ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి చీరకట్టును ఇనుమడింపజేసేలా బ్లౌజ్‌ను డిజైన్‌ చేయించుకుంటూ ఉండాలి. అందుకోసం లేటెస్ట్‌ బ్లౌజ్‌ ట్రెండ్‌ను ఫాలో కావాలి.

బోట్‌ నెక్‌:

మెడకు రెండు వైపులా వెడల్పుగా ఉండే ఈ బోట్‌నెక్‌ డిజైన్‌ ప్లెయిన్‌ చీరలకు చక్కగా నప్పుతుంది. చేతులకు, మెడ చుట్టూరా సెక్విన్‌ వర్క్‌ చేయించుకుంటే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే బోట్‌ నెక్‌ ఎంచుకునేటప్పుడు, చీరతో కాంట్రా్‌స్టగా ఉండేలా చూసుకోవాలి.

చైనీస్‌ కాలర్‌:

మెడకు దగ్గరగా చైనీస్‌ కాలర్‌ను కలిగి ఉండే ఈ బ్లౌజ్‌ మోడర్న్‌ లుక్‌ను తెచ్చి పెడుతుంది. లాంగ్‌ స్లీవ్స్‌, స్లీవ్ల్‌ చివర్లో పట్టీలు బ్లౌజ్‌ అందాన్ని పెంచుతాయి. చైనీస్‌ కాలర్‌ బ్లౌజ్‌లను ప్లెయిన్‌ కలర్‌ శారీ్‌సతో మ్యాచ్‌ చేయవచ్చు.

ఎంబ్రాయిడరీ:

హెవీ లుక్‌ కోసం ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌లను ఎంచుకోవాలి. వేడుకల్లో ప్రత్యేకంగా కనిపించడం కోసం ఇలాంటి ఎంబ్రాయిడరీ డిజైనర్‌ బ్లౌజ్‌లను ఎంచుకోవచ్చు.

హెల్టర్‌ నెక్‌:

మెడను చుట్టి వచ్చే హెల్టర్‌ నెక్‌ బ్లౌజులు మోడర్న్‌ లుక్‌ను తెచ్చి పెడతాయి. ఈవినింగ్‌ పార్టీలకు ఈ తరహా బ్లౌజులు సూటవుతాయి. శాటిన్‌, జార్జెట్‌ చీరలకు నప్పేలా బ్లౌజులను హెల్టర్‌ నెక్‌ డిజైన్‌లో కుట్టించుకోవాలి.

షీర్‌ స్లీవ్స్‌:

పారదర్శకంగా ఉండే షీర్‌ స్లీవ్స్‌ నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. ఆర్గంజా తరహా చీరలకు ఇలాంటి షీర్‌ స్లీవ్స్‌ బ్లౌజులు చక్కగా నప్పుతాయి.

Updated Date - 2022-12-13T22:38:29+05:30 IST