World Animal Day 2022: యానిమల్ ప్రొటెక్షన్ క్యాంప్స్ పెరగాలి..!

ABN , First Publish Date - 2022-10-04T17:33:12+05:30 IST

అంతరించిపోతున్న జంతువుల పరిరక్షణ, వృద్ధి, జంతువుల హక్కులను కాపాడటం అనేవి ప్రధాన లక్ష్యంగా ఈరోజును జరుపుకుంటారు.

World Animal Day 2022: యానిమల్ ప్రొటెక్షన్ క్యాంప్స్ పెరగాలి..!

మనుషులతో పాటు భూమి మీద అనేక రకాల జంతుజాలం ఉంది. ఒకప్పుడు అధిక సంఖ్యలో ఉండే కొన్ని జంతువులు రాను రాను తగ్గుతూ వస్తున్నాయి. ఇలా జంతు జాతులు అంతరించి పోకుండా వాటిని పరిరక్షించే విధంగా జరుపునే రోజే ప్రపంచ జంతు దినోత్సవం ముఖ్య ఉద్దేశం. అడవులలో ఉండే జంతువులతో పాటు మనషులకు అత్యంత సన్నిహితంగా ఉంటూ మచ్చిక చేసుకుని పెంచుకునే కుక్కలు, పిల్లులు ఇతర జంతువుల సంరక్షణ, వైద్యం, సంతానోత్పత్తి ఇలాంటి మరిన్ని విషయాలను గురించి చర్చించుకునే వీలు ప్రతి ఏటా అక్టోబర్ 4వ తేదీన జంతు దినోత్సవం రోజున వేదికగా దీనిని నిర్వహిస్తారు. అంతరించిపోతున్న జంతువుల పరిరక్షణ, వృద్ధి, జంతువుల హక్కులను కాపాడటం అనేవి ప్రధాన లక్ష్యంగా ఈరోజును జరుపుకుంటారు.


మనం జంతువుల ఆవాసాలను నాశనం చేయడం వల్ల చాలా వరకూ జంతువులు సరైన సంరక్షణ లేకుండా పోతుంది. దానికి తోడు విచక్షణా రహితంగా అడవులు నరుకుతూ వాటి తావులను, మంచినీటి వనరులను ధ్వంసం చేయడం కూడా జంతువులు అంతరించి పోవడానికి ప్రధాన కారణం. దీనితో అడవుల్లో ఉండాల్సిన జంతువులు గ్రామాల్లోకి, పట్టణాల్లోకి వచ్చి, మనుషుల చేతుల్లో బందిలైపోతున్నాయి,  ఇదంతా సరైన ఆహారం అందకపోవడం వల్లనే మనుషులపై దాడులు చేస్తూ, బలైపోతున్నాయి. 


ఇలాంటి పరిస్థితిని మార్చడం కూడా ఈ జంతు దినోత్సవ లక్ష్యాల్లో ఒకటి. జంతువులకు సహజసిద్ధమైన ఆవాసాలను కల్పించడం, జంతు జాతులను రక్షించడం, వాటి సంక్షేమాన్ని కాపాడటం కూడా మన ప్రధాన కర్తవ్యం. యానిమల్ ప్రోటెక్షన్ క్యాంప్స్ పెంచడం.. దారితప్పి వచ్చిన కుక్కలు, పిల్లులు ఇతర జంతువును సంరక్షణ కేంద్రాలకు అప్పగించే బాధ్యతను మనమే తీసుకోవాలి. వీధిలో తిరిగే కుక్కలకు తగిన ఆహారాన్ని అందించే బాధ్యత కూడా మనమే తీసుకోవాలి. 

ఈరోజు ఏలా వచ్చిందంటే..

1. 1863లో ప్రాన్స్ లోని లియోన్ లో మొదటిసారిగా పశువైద్యశాలను ప్రారంభించారు. 

2. ఆ తరువాత 1959లో ప్రపంచ వెటర్నరీ అసోసియేషన్ (WVA)ను జంతువుల ఆరోగ్యం, సంక్షేమం పైన అవగాహన కల్పించింది. 

3. జంతువుల పోషకుడైన సెయింట్ ఫ్రాన్సిస్ అస్సిసి గౌరవార్థం అక్టోబర్ నాలుగున ఈ జంతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 

4. 2000 సంవత్సరం నుంచి ప్రపంచ జంతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.  

5. ప్రకృతిలో జంతువుల ప్రాముఖ్యతను గురించి అవగాహన పెంచడం కూడా అంశంగా ఉంటుంది. 

6. పెంపుడు జంతువులను పెంచే వారికి జంతు సంరక్షణ, పశువైద్యుల సేవలు గురించి సదస్సులు నిర్వహిస్తారు, అలాగే వాటికి సంబంధించిన సమాచారాన్ని, సూచనలను అందిస్తారు.

7. మార్చి 24, 1925 న, జర్మనీలోని బెర్లిన్‌లోని స్పోర్ట్ ప్యాలెస్‌లో, మొట్టమొదటి ప్రపంచ జంతు దినోత్సవాన్ని సైనోలజిస్ట్, జంతు సంరక్షణ కార్యకర్త హెన్రిచ్ జిమ్మెర్‌మ్యాన్ జ్ఞాపకం జరుపుకుంటున్నారు.

Updated Date - 2022-10-04T17:33:12+05:30 IST