వైఫై కనెక్ట్‌ కాకుంటే?!

ABN , First Publish Date - 2022-09-10T05:35:27+05:30 IST

ఆండ్రాయిడ్‌ ఫోన్లకు వైఫై కనెక్ట్‌ కావడమే సమస్యగా మారితే ఏమి చేయాలన్నది ప్రశ్న. దగ్గర్లోని సర్వీస్‌ సెంటర్‌కు పరుగుపెట్టడమో

వైఫై కనెక్ట్‌ కాకుంటే?!

ఆండ్రాయిడ్‌ ఫోన్లకు వైఫై కనెక్ట్‌ కావడమే సమస్యగా మారితే ఏమి చేయాలన్నది ప్రశ్న. దగ్గర్లోని సర్వీస్‌ సెంటర్‌కు పరుగుపెట్టడమో, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌కు కాల్‌ చేయడమో పరిష్కారం కాదు. కొన్ని సూచనలు పాటించి కనెక్ట్‌ కావచ్చు.

మొదట డివైస్‌ని రీస్టార్ట్‌ చేయాలి. చాలా సందర్భాల్లో ఈ ఒక్క పనితో మొత్తం సమస్య పరిష్కారమవుతుంది. రీస్టార్టింగ్‌తో బ్యాడ్‌ కనెక్షన్‌తో తలెత్తే ఇబ్బందులు పరిష్కారమవుతాయి. 

వైఫై నుంచి డేటా కనెక్షన్‌కు మారుతూ ఉంటాం. అలాంటప్పుడు మళ్ళీ వైఫైకి సరిగ్గా కనెక్ట్‌ అయ్యిందా లేదా అని చూసుకోవాలి. కానిపక్షంలో ఆండ్రాయిడ్‌ డివైస్‌కు చెందిన సెట్టింగ్స్‌ మెనూకు వెళ్ళి డేటా సోర్సును మార్చుకోవాలి.  డివైస్‌ను బట్టి నెట్‌వర్క్‌ అండ్‌ ఇంటర్నెట్‌ లేదంటే కనెక్షన్లను టర్నాఫ్‌ చేయాలి. అవసరాన్నిబట్టి వైఫై లేదంటే డేటా కనెక్షన్‌ను కట్‌ చేసుకోవాలి. స్విచ్‌ బ్యాక్‌ ద్వారా అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు మారవచ్చు.

సెట్టింగ్స్‌ మెనూ నుంచి ఎయిరోప్లేన్‌ మోడ్‌ని ఎనేబిలింగ్‌ లేదా డిజేబుల్‌ చేయడం మరో ట్రిక్కు. డివైస్‌ని స్విచ్చాఫ్‌ చేసి, రీస్టార్ట్‌ చేసినప్పటికీ పని కాకుంటే, ఏర్‌ప్లేన్‌ మోడ్‌ని ఎనేబుల్‌ చేసుకుని మళ్ళీ డిసేబుల్‌ చేయడానికి పది సెకెండ్లు ఆగండి. కనెక్టివిటీ కుదిరిందా లేదా అని చెక్‌ చేసుకోవాలి. 

అన్నీ ఫెయిల్‌ అయితే రౌటర్‌ని రీస్టార్ట్‌ చేయాలి. దానికంటే ముందు రౌటర్‌ మాన్యువల్‌ని ఆసాంతం చదివి, అందులో ఇచ్చిన సూచనలను పాటించాలి. మాన్యువల్‌ ఇచ్చిన స్టెప్స్‌ ప్రకారం పనిచేయాలి. అలాగే రౌటర్‌ని అన్‌ప్లగ్‌ చేసి, మళ్ళీపెట్టడానికి కనీసం అర నిమిషం వ్యవధిని ఇవ్వాలి.

Updated Date - 2022-09-10T05:35:27+05:30 IST