ఒంట్లో రెండు బుల్లెట్లు దిగినా టెర్రరిస్టులతో పోరాడిన ‘జూమ్‌’

ABN , First Publish Date - 2022-10-12T07:19:25+05:30 IST

కుక్క విశ్వాసానికి ప్రతీక. ఈ ‘జూమ్‌’ ధైర్య సాహసాలకు నిదర్శనం.

ఒంట్లో రెండు బుల్లెట్లు దిగినా టెర్రరిస్టులతో పోరాడిన ‘జూమ్‌’

కశ్మీర్‌లో సైనిక జాగిలం ధైర్య సాహసాలు

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్మూ, అక్టోబరు 11: కుక్క విశ్వాసానికి ప్రతీక. ఈ ‘జూమ్‌’ ధైర్య సాహసాలకు నిదర్శనం. శరీరంలోకి రెండు బుల్లెట్లు దిగినా వెరవక ఉగ్రవాదులపైకి ఉరికింది. రక్తం కారుతున్నా.. ఒంట్లో శక్తి సన్నగిల్లుతున్నా వీరోచితంగా పోరాడింది. ఈ ఘటన జమ్మూ కశ్మీర్‌లో సోమవారం చోటుచేసుకుంది. జూమ్‌.. ఓ సైనిక జాగిలం. అనంతనాగ్‌ జల్లా తంగపావాలో ఇద్దరు లష్కరే తాయిబా ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు వెళ్లాయి. ఎప్పటిలా ముందుగా జూమ్‌ను ఆ ఇంట్లోకి పంపాయి. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో జూమ్‌ ఒంట్లోకి రెండు బుల్లెట్లు దిగాయి. అయినా అది వెనకడుగు వేయకుండా పోరాడింది. ఈలోపు భద్రతా దళాలు టెర్రరిస్టులను ఎన్‌కౌంటర్‌ చేశాయి. వెంటనే జూమ్‌ను ఆర్మీ వెటర్నరీ హాస్పిటల్‌కు తరలించాయి. 

Read more