ప్రపంచ ప్రసిద్ధ 100 వైద్య కళాశాలల్లో Madras ప్రభుత్వ వైద్య కళాశాల

ABN , First Publish Date - 2022-04-17T15:59:15+05:30 IST

ప్రపంచ ప్రసిద్ధ 100 వైద్యకళాశాలల జాబితాలో మద్రాసు ప్రభుత్వ వైద్యకళాశాల స్థానం దక్కించుకుంది. ప్రముఖ వాణిజ్య పత్రిక ‘సీఈఓ వరల్డ్‌’ వెలువరించిన ఈ జాబితాలో, అమెరికాలోని

ప్రపంచ ప్రసిద్ధ 100 వైద్య కళాశాలల్లో Madras ప్రభుత్వ వైద్య కళాశాల

పెరంబూర్‌(చెన్నై): ప్రపంచ ప్రసిద్ధ 100 వైద్యకళాశాలల జాబితాలో మద్రాసు ప్రభుత్వ వైద్యకళాశాల స్థానం దక్కించుకుంది. ప్రముఖ వాణిజ్య పత్రిక ‘సీఈఓ వరల్డ్‌’ వెలువరించిన ఈ జాబితాలో, అమెరికాలోని హార్డ్‌వేర్‌ వైద్యకళాశాల మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో జాన్‌హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయ వైద్య కళాశాల నిలిచింది. ఈ జాబితాలో తొలి 20వ స్థానాల్లో అమెరికాకు చెందిన విశ్వవిద్యాలయాలు చోటుచేసుకున్నాయి. భారత్‌కు చెందిన ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యకళాశాల 21వ స్థానం, పూనే భారత సైనిక వైద్యకళాశాల 37వ స్థానం, వేలూరు క్రైస్తవ వైద్యకళాశాల (సీఎంసీ) 46వ స్థానం, పుదుచ్చేరి జిప్మర్‌ వైద్యకళాశాల 55వ స్థానం, మద్రాసు ప్రభుత్వ వైద్యకళాశాల 60వ స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో చోటుచేసుకున్న ఐదు దేశీయ వైద్యకళాశాలల్లో రెండు కళాశాలలు కేంద్రప్రభుత్వం, ఒకటి రక్షణ శాఖ, మరొకటి మైనార్టీ విద్యాసంస్థకు చెందినవి కాగా, రాష్ట్రప్రభుత్వ నిర్వహణలోని ఒకే ఒక వైద్యశాలగా మద్రాసు వైద్యకళాశాల నిలిచింది.

Read more