Commission for Women: విదేశీ మహిళలతో బలవంతంగా వ్యభిచారం రాకెట్...మహిళా కమిషన్ నోటీసులు

ABN , First Publish Date - 2022-08-31T13:59:28+05:30 IST

విదేశాలకు చెందిన ఏడుగురు మహిళలతో బలవంతంగా వ్యభిచారం వృత్తిలోకి దించిన బాగోతంపై...

Commission for Women: విదేశీ మహిళలతో బలవంతంగా వ్యభిచారం రాకెట్...మహిళా కమిషన్ నోటీసులు

న్యూఢిల్లీ: విదేశాలకు చెందిన ఏడుగురు మహిళలతో బలవంతంగా వ్యభిచారం వృత్తిలోకి దించిన బాగోతంపై ఢిల్లీ మహిళా కమిషన్(Delhi Commission for Women)తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగాల సాకుతో ఏడుగురు ఉజ్బెకిస్థాన్‌(Uzbekistan) మహిళలను భారత్‌కు తీసుకొచ్చి, వారిని వ్యభిచార రొంపిలోకి దింపిన వ్యవహారంపై ఢిల్లీ మహిళా కమిషన్‌ పోలీసులకు(Delhi Police) నోటీసు(notice) జారీ చేసింది.ఏడుగురు  ఉజ్బెకిస్తాన్ మహిళలను బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని ఫిర్యాదు అందడంతో ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) స్పందించింది. 


ఉజ్బెక్ మహిళలను నేపాల్(nepal) మీదుగా ఢిల్లీకి(Delhi), మరికొందరిని నేరుగా భారత్ కు టూరిస్టు, మెడికల్ వీసాలపై తీసుకువచ్చారు.మెడికల్ వీసాపై ఢిల్లీకి తీసుకొచ్చిన  ఉజ్బెకిస్తాన్ మహిళల పాస్‌పోర్టులు, ఇతర పత్రాలను భారత్‌కు వచ్చిన తర్వాత అక్రమార్కులు ఎత్తుకెళ్లారు.ఉజ్బెక్ మహిళలు భారతదేశానికి చేరుకోగానే వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపారని, ప్రతిఘటిస్తే బెదిరించి కొట్టారని, పట్టుకుని జైల్లో పెడతామని చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న సమయంలో తమను వేర్వేరు యజమానులకు విక్రయించారని, వారు తమపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత మహిళలు తెలిపారు. 


ఒక మహిళ పోలీసు అధికారిగా నటిస్తూ తన యజమానిని కలిసి, తుపాకీ పట్టుకుని తరచూ బెదిరించేదని బాధిత మహిళలు ఆరోపించారు.కొన్ని రోజుల క్రితం బాధిత మహిళలు వ్యభిచారం చెర నుంచి తప్పించుకొని ఉజ్బెకిస్తాన్ ఎంబసీకి(Uzbekistan Embassy) వచ్చారు.


 ‘‘దేశ రాజధాని నగరమైన ఢిల్లీ ట్రాఫికర్ల (traffickers) హబ్‌గా మారింది. అక్రమ రవాణాదారులు అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్నారు...అక్రమ రవాణాదారులు అంతర్జాతీయ సరిహద్దుల గుండా మహిళలు, బాలికలను అక్రమంగా చేరవేస్తున్నారు, ఈ వ్యవహారం దేశ భద్రతకు ముప్పుగా మారుతున్నందున ఈ రాకెట్ పై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు జరిపి ముఠాను అరెస్టు చేయాలి’’ అని ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్(DCW Chief Swati Maliwal) పోలీసులను కోరారు.



Updated Date - 2022-08-31T13:59:28+05:30 IST