Land slide: ఒకే కుటుంబంలో ఐదుగురు సజీవసమాధి

ABN , First Publish Date - 2022-09-26T21:29:12+05:30 IST

హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్‌మౌర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు సజీవ సమాధి...

Land slide: ఒకే కుటుంబంలో ఐదుగురు సజీవసమాధి

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్‌మౌర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు సజీవ సమాధి అయ్యారు. వీరిలో ఒక మహిళ, నలుగురు మైనర్లు ఉన్నారు. రోన్హట్ సమీపంలోని ఖజ్‌వాడి గ్రామంలో ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఇంట్లో అంతా నిద్రిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. మృతులను మమత (27), ఆమె ముగ్గురు కుమార్తెలైన అరంగ్ (2), అమిష (6), ఐషిత (8), మేనకోడలు ఆకాన్షిక (7)గా  గుర్తించారు. కాగా, మమత భర్త ఈ ఘటనలో గాయపడ్డాడు.

Read more