గేమింగ్‌ యాప్‌తో రూ. కోట్లు కొల్లగొట్టాడు

ABN , First Publish Date - 2022-09-11T08:54:46+05:30 IST

గేమింగ్‌ యాప్‌తో వేలమంది వినియోగదారులను రూ. కోట్లలో ముంచిన ఓ వ్యాపారి ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) శనివారం దాడులు చేసింది.

గేమింగ్‌ యాప్‌తో రూ. కోట్లు కొల్లగొట్టాడు

కోల్‌కతా వ్యాపారి ఇంట్లో రూ. 7 కోట్లు సీజ్‌ చేసిన ఈడీ

కోల్‌కతా, సెప్టెంబరు 10: గేమింగ్‌ యాప్‌తో వేలమంది వినియోగదారులను రూ. కోట్లలో ముంచిన ఓ వ్యాపారి ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) శనివారం దాడులు చేసింది. కోల్‌కతాలో ఏకకాలంలో ఆరుచోట్ల సోదాలు చేపట్టగా.. ఆ వ్యాపారి ఇంట్లో రూ. 17 కోట్ల నగదు, ఆస్తిపత్రాలు లభ్యమయ్యాయి. కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్‌ ప్రాంతానికి చెందిన ఆమిర్‌ఖాన్‌ ‘ఈ-నగ్గెట్స్‌’ పేరుతో ఓ మోసపోరిత గేమింగ్‌యా్‌పను నిర్వహిస్తున్నాడు. అందులో రిజిస్టర్‌ అయిన వారు కొంత సొమ్ము చెల్లించాలి. తొలుత వారికి ఆ మొత్తానికి భారీగా కమీషన్లు ఇస్తుంటారు. నమ్మకం కుదిరాక వినియోగదారులు పెద్దమొత్తంలో నగదు బదిలీ చేయగానే.. ఆమిర్‌ఖాన్‌ తన మోసాన్ని ప్రారంభిస్తాడు. యూజర్లు నగదును విత్‌డ్రా చేసుకోకుండా ఆప్షన్‌ను తొలగిస్తాడు. సర్వర్‌ సమస్యలున్నట్లు సందేశాలు పంపుతూ.. క్రమంగా వారి డేటాను తుడిచిపెట్టేస్తాడు. దీనిపై పలువురు వినియోగదారులు చేసిన ఫిర్యాదుపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఆ కేసులో మనీలాండరింగ్‌ కోణంపై ఈడీ రంగంలోకి దిగింది. శనివారం జరిపిన దాడుల్లో రూ. 17 కోట్ల నగదు కట్టలు.. కొన్ని ఆస్తిపత్రాలను సీజ్‌ చేసింది. 

Read more