బియ్యం ధరలకు రెక్కలు!

ABN , First Publish Date - 2022-09-19T07:10:30+05:30 IST

దేశ వ్యాప్తంగా బియ్యం ధరలకు రెక్కలు రానున్నాయి. ఈ ఏడాది ఖరీ్‌ఫలో వరి సాగు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ధాన్యం దిగుబడి భారీగా తగ్గనుంది.

బియ్యం ధరలకు రెక్కలు!

ఖరీఫ్‌లో తగ్గిన వరి సాగు 

ఏడాదిలో 10.7% పెరిగిన టోకు ధర 

న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: దేశ వ్యాప్తంగా బియ్యం ధరలకు రెక్కలు రానున్నాయి. ఈ ఏడాది ఖరీ్‌ఫలో వరి సాగు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ధాన్యం దిగుబడి భారీగా తగ్గనుంది. దీంతో బియ్యం ధరలు పెరుగుతాయని అంచనా. వినియోగదారుల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. ఏడాది క్రితం క్వింటాలుకు రూ.3,047గా ఉన్న బియ్యం టోకు ధర సెప్టెంబరు 14నాటికి 10.7 శాతం పెరిగి రూ.3,357కి చేరింది. ఇదే సమయానికి రిటైల్‌ ధరలు రూ.34.85 నుంచి 9.4 శాతం పెరిగి రూ.38.15కు చేరింది. దేశంలోని మొత్తం బియ్యం ఉత్పత్తిలో 85శాతం వరకూ ఖరీఫ్‌ సీజన్‌లోనే వస్తుంది. ఈ సారి 6 నుంచి 7 మిలియన్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి తగ్గుతుందని ఆహార మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఫలితంగా దేశంలో ఆహార భద్రత దెబ్బతినే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమ వుతోంది.. అయితే ధరలపై ఎలాంటి భయాలూ అవసరం లేదని, కేంద్రం వద్ద ప్రజా పంపిణీకి సరిపడా నిల్వలు ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Read more