రబ్బరు స్టాంపుగా ఉండనని ద్రౌపది ప్రమాణం చేస్తారా?: యశ్వంత్‌ సిన్హా

ABN , First Publish Date - 2022-07-05T07:55:44+05:30 IST

కేంద్రప్రభుత్వానికి రబ్బరు స్టాంపుగా పనిచేయనని రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయగలరా అని ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా సవాల్‌ విసిరారు.

రబ్బరు స్టాంపుగా ఉండనని ద్రౌపది ప్రమాణం చేస్తారా?: యశ్వంత్‌ సిన్హా

న్యూఢిల్లీ, జూలై 4: కేంద్రప్రభుత్వానికి రబ్బరు స్టాంపుగా పనిచేయనని రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయగలరా అని ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా సవాల్‌ విసిరారు. ఈ నెల 18న జరిగే ఎన్నికల్లో వారిద్దరు పోటీ చేస్తున్నారు. రాష్ట్రపతిగా తాను ఎన్నికైతే దేశద్రోహం చట్టం రద్దుకు కృషిచేస్తానని సిన్హా సోమవారం ట్విటర్‌లో వివరించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఓ గిరిజన మహిళకు నిప్పంచిన ఘటనను ప్రస్తావిస్తూ బీజేపీపై విమర్శలు కురిపించారు. ఆదివాసీ మహిళ రాష్ట్రపతి పదవికి అర్హురాలు కాదన్న భావన.. దుష్ట మనస్త త్వాన్ని తెలియజేస్తోందంటూ సిన్హాపై బీజేపీ మండిపడింది. 

Read more