బుర్ఖా ధరించలేదని భార్య హత్య

ABN , First Publish Date - 2022-09-28T07:34:07+05:30 IST

ముస్లిం సంప్రదాయాలను పాటించడం లేదంటూ భార్యతో వాదనకు దిగిన ఓ భర్త ఆమెను కత్తితో పొడిచిన హత్య చేసిన సంఘటన సోమవారం రాత్రి ముంబయిలో చోటుచేసుకుంది.

బుర్ఖా ధరించలేదని భార్య హత్య

ముంబయి, సెప్టెంబరు 27: ముస్లిం సంప్రదాయాలను పాటించడం లేదంటూ భార్యతో వాదనకు దిగిన ఓ భర్త ఆమెను కత్తితో పొడిచిన హత్య చేసిన సంఘటన సోమవారం రాత్రి ముంబయిలో చోటుచేసుకుంది. దీనిపై పోలీసు అధికారి వికాస్‌ రాథోడ్‌ మాట్లాడుతూ.. ‘‘ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇక్బాల్‌ షేక్‌ (36) హిందూ మహిళ రూపాలీ (20)ని 2019లో వివాహం చేసుకున్నాడు. అనంతరం ఆమెకు జర అన్న పేరు పెట్టాడు. 2020లో వారికి కుమారుడు పుట్టాడు. ముస్లిం సంప్రదాయాల ప్రకారం బుర్ఖా ధరించాలని ఇక్బాల్‌ కుటుంబ సభ్యులు ఒత్తిడి తేవడంతో వివాదం మొదలయింది. దాంతో కుమారుడ్ని తీసుకొని కొద్ది నెలలుగా వేరుగా ఉంటోంది. విడాకులు విషయమై మాట్లాడడానికి సోమవారం ఆమెను పిలిపించారు. రాత్రి పది గంటల సమయంలో మాటామాటా పెరగడంతో కోపం పట్టుకోలేక ఆమెను ఇంటి పక్కన సందులోకి ఈడ్చుకెళ్లి పలుమార్లు కత్తితో పొడిచాడు. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది’’ అని వివరించారు. 

Read more