India ఎందుకు క్షమాపణలు చెప్పాలి?.. Nupur sharma కు విదేశీ పొలిటీషియన్ మద్దతు

ABN , First Publish Date - 2022-06-07T22:55:00+05:30 IST

మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు, గల్ఫ్ దేశాల అగ్రహజ్వాలల నేపథ్యంలో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు మద్ధతుగా ఓ విదేశీ రాజకీయ నాయకుడు తన గొంతు వినిపించారు. నుపుర్ శర్మ వ్యాఖ్యలను ఆక్షేపిస్తున్న అరబ్ దేశాలపై నెదర్లాండ్ చట్టసభ్యుడు

India ఎందుకు క్షమాపణలు చెప్పాలి?.. Nupur sharma కు విదేశీ పొలిటీషియన్ మద్దతు

న్యూఢిల్లీ : మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు, గల్ఫ్ దేశాల అగ్రహజ్వాలల నేపథ్యంలో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు మద్ధతుగా ఓ విదేశీ రాజకీయ నాయకుడు తన గొంతు వినిపించారు. నుపుర్ శర్మ వ్యాఖ్యలను ఆక్షేపిస్తున్న అరబ్ దేశాలపై నెదర్లాండ్ చట్టసభ్యుడు గీర్ట్ విల్డర్స్ మండిపడ్డారు. మహ్మద్ ప్రవక్తకు సంబంధించి నుపుర్ శర్మ ఒక్కరే నిజం మాట్లాడారని ఫ్రీడం పార్టీకి చెందిన విల్డర్స్ అన్నారు. భారత్ ఎందుకు క్షమాపణలు చెప్పాలని గల్ఫ్ దేశాలను ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘‘ బుజ్జగింపులు అసలు పనిచేయవు. పైగా పరిస్థితులు మరింతగా దిగజారుతాయి. కాబట్టి భారతీయ మిత్రులారా ఇస్లామిక్ దేశాలకు భయపడిపోకండి. స్వేచ్ఛ కోసం నిలబడండి, గర్వించండి. మహ్మద్ ప్రవక్త గురించి వాస్తవం చెప్పిన భారతీయ పొలిటీషియన్ నుపుర్ శర్మకు అండగా నిలవండి’’ అని ఆయన పేర్కొన్నారు. 


సత్యం మాట్లాడిన నుపుర్ శర్మపై అరబ్, ఇస్లామిక్ దేశాలు ఆగ్రహాన్ని ప్రదర్శించడం హాస్యాస్పదంగా ఉందని గిర్డ్ విల్డర్స్ విమర్శించారు. నుపుర్ శర్మ మాట్లాడింది సత్యమే కదా.. భారత్ ఎందుకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. కాగా నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలపై కువైట్, ఖతర్, ఇరాన్, సౌదీఅరేబియా, యూఏఈ, బహ్రెయిన్, జోర్డాన్‌తోపాటు పలు దేశాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. పలు దేశాలు భారతీయ రాయబారులకు సమన్లు కూడా జారీ చేశాయి. కాగా నుపుర్ శర్మను పార్టీ అధికారి ప్రతినిధి పదవి నుంచి బీజేపీ సస్పెండ్ చేసింది. ఆమెతోపాటు బీజేపీ ఢిల్లీ యూనిట్ మీడియా హెడ్ నవీన్ కుమార్ జిందాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. మరోవైపు తన కుటుంబానికి ప్రమాదం పొంచివుందని, భద్రత కల్పించాలని నుపుర్ శర్మ పోలీసులను కోరిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-06-07T22:55:00+05:30 IST