Shocking video: కూర్చున్న కొమ్మను నరికినట్లుగా.. ఏంటీ నిర్లక్ష్యం బ్రదర్.. కూల్చే ముందు కాస్త చూసుకోవాలి కదా..

ABN , First Publish Date - 2022-09-27T02:14:23+05:30 IST

ప్లానింగ్ లేకుండా చేసే పనులు... కొన్నిసార్లు బెడిసికొడుతుంటాయి. ఏమవుతుందిలే అనుకుని చేసే పనులు.. చివరకు ప్రాణాంతకమవుతుంటాయి. అయితే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా..

Shocking video: కూర్చున్న కొమ్మను నరికినట్లుగా.. ఏంటీ నిర్లక్ష్యం బ్రదర్.. కూల్చే ముందు కాస్త చూసుకోవాలి కదా..

ప్లానింగ్ లేకుండా చేసే పనులు... కొన్నిసార్లు బెడిసికొడుతుంటాయి. ఏమవుతుందిలే అనుకుని పనిలోకి దిగి.. చివరకు ప్రాణం మీదకు తెచ్చుకుంటుంటారు. అయితే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా అప్పుడప్పుడూ కొందరు అదృష్టం బాగుండి క్షేమంగా బయటపడుతుంటారు.  ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది కాబట్టి.. ఎలాంటి చిన్న ఘటన జరిగినా ఇట్టే కళ్ల ముందుకు వచ్చి పడుతోంది. ఆశ్చర్యకరంగా అనిపించే వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ వ్యక్తి పాత వంతెన కూల్చుతున్న క్రమంలో మొత్తం విరిగిపడుతుంది. దీంతో ఎక్సకవేటర్ కూడా నీటిలో మునిగిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ముజఫర్‌నగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. గంగా కాలువపై బ్రిడ్జిని నిర్మించారు. అయితే పక్కనే ఉన్న 100 ఏళ్ల నాటి పాత బ్రిడ్జి (old bridge) ప్రమాదకరంగా ఉండడంతో అధికారులు కూల్చేయాలని నిర్ణయించుకున్నారు. ఎక్సకవేటర్‌తో కూల్చుతుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. బ్రిడ్జి మధ్యలో ఉన్న ఎక్సకవేటర్ డ్రైవర్.. అవతలి భాగాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఆ భాగం ఒకేసారి కూలిపోవడంతో చివరకు ఇవతలి భాగం మొత్తం కూడా కూలిపోతుంది. దీంతో మధ్యలో ఉన్న ఎక్సకవేటర్ సడన్‌గా నీటిలో మునిగిపోతుంది. పక్కనే ఉన్న వారు పరుగెత్తుకుంటూ వెళ్లి ప్రాణాలు కాపాడుకుంటారు. అయితే అదృష్టవశాత్తు డ్రైవర్ కూడా క్షేమంగా బయటపడతాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. బ్రిడ్జిని కూల్చేముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కదా.. అంటూ కొందరు.. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: రైల్వే స్టేషన్‌లో షాకింగ్ సీన్.. నెట్టింట వైరల్‌గా మారిన 22 సెకన్ల వీడియో..!





Read more