నౌకాదళ దినోత్సవాన్ని భారత్ ఈసారి ఎక్కడ నిర్వహించనుందంటే..

ABN , First Publish Date - 2022-11-07T14:21:11+05:30 IST

ఈ ఏడాది నౌకాదళ దినోత్సవాన్ని భారత నౌకాదళం వైజాగ్‌లో నిర్వహించనుంది. డిసెంబర్ 4న విశాఖ నౌకాదళ కేంద్రంలో నిర్వహించాలని భారత నౌకాదళం నిర్ణయించింది.

నౌకాదళ దినోత్సవాన్ని భారత్ ఈసారి ఎక్కడ నిర్వహించనుందంటే..

న్యూ ఢిల్లీ : ఈ ఏడాది నౌకాదళ దినోత్సవాన్ని (Navy day) భారత నౌకాదళం (Indian Navy force) వైజాగ్‌లో నిర్వహించనుంది. డిసెంబర్ 4న విశాఖ నౌకాదళ కేంద్రంలో నిర్వహించాలని భారత నౌకాదళం నిర్ణయించింది. నౌకాదళ దినోత్సవంలో వైజాగ్ కేంద్రంగా పలు విన్యాసాలను నౌకా దళ సిబ్బంది చేపట్టనుంది. ఇటీవల నౌకాదళంలో చేరిన యుద్ధ విమానాలు.. యుద్ధనౌకలు అధునాతన పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్ఎస్ విక్రాంత్ (INS Vikranth) సహా భారత నౌకాదళ సత్తాను ప్రదర్శించే అవకాశం ఉంది. ఐఎన్ఎస్ విక్రాంత్ అధికారికంగా భారత నౌకాదళంలో చేరిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న నౌకాదళ ఉత్సవంలో హాజరుకానున్నట్లు డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగించే వెస్ట్రన్ కమాండ్ నుంచి కూడా పూర్తిస్థాయి సిబ్బంది హాజరుకానున్నట్లు తెలిపాయి. నౌకాదళ ఉత్సవాలకు సీడీఎస్ సహా త్రివిధ దళాధిపతులు హాజరుకానున్నట్లు డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి

Updated Date - 2022-11-07T14:21:11+05:30 IST

Read more