China విమానం మన వైపు వచ్చిన ప్రతిసారీ... : IAF chief VR Chaudhari

ABN , First Publish Date - 2022-07-17T21:20:01+05:30 IST

తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి గగనతల కార్యకలాపాలను

China విమానం మన వైపు వచ్చిన ప్రతిసారీ... : IAF chief VR Chaudhari

న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి గగనతల కార్యకలాపాలను నిరంతరం క్షుణ్ణంగా గమనిస్తున్నట్లు భారత వాయు సేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ఆదివారం చెప్పారు. చైనా విమానాలు ఘర్షణ ప్రదేశాలకు బాగా దగ్గరగా వస్తున్నట్లు గమనించిన వెంటనే వాటిని నిరోధించేందుకు తగిన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. భారత్-చైనా సైనికాధికారుల మధ్య 16వ విడత చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 


వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి తూర్పు లడఖ్‌లో 2020 మే 5 నుంచి కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్-చైనా సైనిక కమాండర్ల 16వ విడత చర్చలు ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యాయి. భారత దేశంవైపు గల చూసుల్ మోల్డో వద్ద ఈ చర్చలు జరుగుతున్నాయి. ఎల్ఏసీ వెంబడి మిగిలిన ఫ్రిక్షన్ పాయింట్ల వద్ద సమస్యలను పరిష్కరించుకోవడమే ఈ చర్చల లక్ష్యం. 


ఓ వార్తా సంస్థ కథనం ప్రకారం, IAF చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి మాట్లాడుతూ, LAC వెంబడి గగనతల కార్యకలాపాలను నిరంతరం IAF (భారత వాయు సేన) గమనిస్తోందని చెప్పారు. ఎల్ఏసీకి బాగా దగ్గరగా చైనీస్ విమానం వస్తున్నట్లు గుర్తించిన వెంటనే యుద్ధ విమానాలను రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు. అన్ని వ్యవస్థలను హై అలర్ట్‌లో ఉంచుతున్నట్లు చెప్పారు. తమ చర్యలు చైనాను నిలువరిస్తున్నట్లు తెలిపారు. 


జూన్ చివరి వారంలో ఓ చైనా విమానం వాస్తవాధీన రేఖ వెంబడి ఘర్షణ ప్రాంతాలకు వచ్చి, కొద్ది నిమిషాలపాటు ఎగిరింది. ఆ విమానాన్ని భారతీయ రాడార్లు గుర్తించాయి. అనంతరం ఐఏఎఫ్ యుద్ధ విమానాలు ఆ విమానాన్ని తరిమేశాయి. చైనీయులు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారో తాను చె్ప్పలేనని వీఆర్ చౌదరి చెప్పారు. 


అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ

రక్షణ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకం (Agnipath Scheme) గురించి ఎయిర్ చీఫ్ మార్షల్ చౌదరి (Air Chief Marshal VR Chaudhari) మాట్లాడుతూ, అగ్నిపథ్ పథకంలో చేరేందుకు 7.5 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. రక్షణ దళాల్లో చేరడానికి యువత ఎంత ఉత్సాహంగా ఉన్నారో దీనినిబట్టి అర్థమవుతోందన్నారు. ఎంపికైనవారికి డిసెంబరు నుంచి శిక్షణను ప్రారంభించవలసి ఉందన్నారు. ఇదంతా సకాలంలో జరగడానికి వీలుగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడం పెద్ద సవాలు అని చెప్పారు. 


ఈ ఏడాది వాయు సేన దినోత్సవ కవాతును చండీగఢ్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన కార్యక్రమాలను ఢిల్లీకి బయట వేరొక ప్రాంతంలో నిర్వహించాలనేది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కల అని చెప్పారు. ఐఏఎఫ్ సామర్థ్యాలను దేశ యువతకు చూపించాలనేది తమ ఆలోచన అని తెలిపారు. అందుకే ఈ విన్యాసాలను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క చోట నిర్వహిస్తున్నామని వివరించారు. 


చండీగఢ్‌లో జరిగే విన్యాసాల్లో రఫేల్, ఎస్‌యూ-30, మిరేజ్ 2000 వంటి యుద్ధ విమానాలు పాల్గొంటాయి. సుప్రసిద్ధ సుఖ్నా సరస్సుపైన ఈ విన్యాసాలు జరుగుతాయి. చండీగఢ్‌తోపాటు దాని పరిసరాల్లోని పట్టణాల ప్రజలు కూడా వీటిని వీక్షిస్తారని అంచనా.


Updated Date - 2022-07-17T21:20:01+05:30 IST