ఆ ఫిదాయీని మేమూ విచారిస్తాం

ABN , First Publish Date - 2022-08-25T09:25:20+05:30 IST

ఆ ఫిదాయీని మేమూ విచారిస్తాం

ఆ ఫిదాయీని మేమూ విచారిస్తాం

రష్యాను కోరిన భారత దర్యాప్తు బృందాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 24: బీజేపీ బహిష్కృత నాయకురాలు నూపుర్‌ శర్మ లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి పథకం పన్నిన ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఫిదాయీ(మానవబాంబు)ని విచారించేందుకు అనుమతించాలని భారత దర్యాప్తు సంస్థలు రష్యాను కోరాయి. రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీ్‌స(ఆర్‌ఎ్‌ఫబీ) అధికారులు ఇటీవల అజమోవ్‌ అనే ఉజ్బెకిస్థాన్‌ జాతీయుడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు, నూపుర్‌శర్మను అంతమొందించేందుకు ఐఎస్‌ తనను రిక్రూట్‌ చేసిందని, రష్యా మీదుగా భారత్‌ వెళ్లాల్సి ఉందని అజమోవ్‌ ఓ వీడియోలో వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు అజమోవ్‌ను విచారించేందుకు అనుమతించాలని ఆర్‌ఎ్‌ఫబీని భారత్‌ కోరింది. ఇప్పటికే కేంద్ర నిఘా సంస్థ(ఐబీ), జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ), రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌(రా) ప్రతినిధులు మాస్కో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఫిదాయీని అరెస్టు చేయడం పట్ల రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రష్యాను అభినందించారు.


Updated Date - 2022-08-25T09:25:20+05:30 IST