వార్డు సభ్యురాలిగా తెలుగు మహిళ ఏకగ్రీవ ఎన్నిక

ABN , First Publish Date - 2022-07-03T14:22:32+05:30 IST

తిరువళ్లూర్‌ జిల్లా కొత్త గుమ్మిడిపూండి పంచాయతీ వార్డు సభ్యురాలిగా తెలుగు మహిళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పంచాయతీ పరిధిలోని 9వ వార్డు

వార్డు సభ్యురాలిగా తెలుగు మహిళ ఏకగ్రీవ ఎన్నిక

గుమ్మిడిపూండి(చెన్నై), జూలై 2: తిరువళ్లూర్‌ జిల్లా కొత్త గుమ్మిడిపూండి పంచాయతీ వార్డు సభ్యురాలిగా తెలుగు మహిళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పంచాయతీ పరిధిలోని 9వ వార్డు సభ్యులుగా గెలుపొందిన జయలక్ష్మి అనారోగ్యంతో ఇటీవల మృతిచెందారు. ఆ స్థానానికి ఎన్నిక ప్రకటించారు. ఈ పదవి కోసం గుమ్మిడిపూండికి చెంది సుధ, బాలకృష్ణాపురానికి చెందిన తెలుగు మహిళ ఈశ్వరి నామినేషన్లు దాఖలుచేశారు. ఈ నేపథ్యంలో సుధ నామినేషన్‌ ఉపసంహరించుకోవడంతో ఈశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రాంతీయ ఎన్నికల అధికారి వాసుదేవన్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆమెకు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఈశ్వరిని పంచాయతీ అధ్యక్షులు డా.అశ్విని సుకుమారన్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ ఎల్లప్పన్‌, తెలుగు ప్రముఖులు చిట్టిబాబు, తెలుగు వికాస సమితి కార్యదర్శి వెలుగుల కృష్ణమోహన్‌లు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

Read more