కోవైలో ఉప రాష్ట్రపతి

ABN , First Publish Date - 2022-05-17T14:02:10+05:30 IST

భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సోమవారం కోయంబత్తూరు చేరుకున్నారు. అబుదాభి నుంచి ప్రత్యేక విమానంలో సతీమణితో కలిసి కోయంబత్తూరు చేరుకున్న వెంకయ్యకు స్థానిక

కోవైలో ఉప రాష్ట్రపతి

చెన్నై: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సోమవారం కోయంబత్తూరు చేరుకున్నారు. అబుదాభి నుంచి ప్రత్యేక విమానంలో సతీమణితో కలిసి కోయంబత్తూరు చేరుకున్న వెంకయ్యకు స్థానిక నేతలు, ఉన్నతాధికారులు విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు. కోయంబత్తూరు జిల్లా ఊటీలో జరిగే వివిధ కార్య క్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన సోమవారమే అక్కడకు వెళ్లాల్సి వుంది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్‌ టేకాఫ్‌ తీసుకోలేకపోయింది. దీంతో అధికారులు అప్పటికప్పుడు ఉపరాష్ట్రపతి దంపతులు బస చేసేందుకు కోవైలోని గెస్ట్‌హౌస్ లో ఏర్పాట్లు చేపట్టారు. మంగళవారం ఉదయం ఉపరాష్ట్రపతి ఊటీ చేరుకుంటారు. అక్కడ విల్లింగ్టన్‌లో వున్న డిఫెన్స్‌సర్వీ్‌స స్టాఫ్‌ కాలేజీని సందర్శించి, రక్షణశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడతారు. బుధవారం ఆయన ఊటీలో వున్న లారెన్స్‌ స్కూల్‌ను సందర్శించనున్నారు.

Read more