ఊటీలో వెంకయ్యనాయుడు

ABN , First Publish Date - 2022-05-18T13:02:29+05:30 IST

భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మంగళవారం ఊటీ చేరుకున్నారు. అక్కడి వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీస్‌ స్టాఫ్‌ కాలేజీని వెంకయ్య దంపతులు సందర్శించారు. వారికి డిఫెన్స్‌ స

ఊటీలో వెంకయ్యనాయుడు

- డిఫెన్స్‌ కాలేజీ సందర్శన

- 52 ఏళ్ల అనంతరం ఈ కళాశాలను సందర్శించిన ఉపరాష్ట్రపతి


చెన్నై: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మంగళవారం ఊటీ చేరుకున్నారు. అక్కడి వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీస్‌ స్టాఫ్‌ కాలేజీని వెంకయ్య దంపతులు సందర్శించారు. వారికి డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజ్‌ కమాండెంట్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ ఎస్‌.మోహన్‌, శశిరేఖా మోహన్‌, పలువురు ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ఇదిలా వుండగా 52 ఏళ్ల తరువాత ఈ కాలేజీని సందర్శించిన తొలి ఉపరాష్ట్రపతి వెంకయ్య కావడం విశేషం. 1970 ప్రాంతంలో నాటి ఉపరాష్ట్రపతి గోపాల్‌ స్వరూప్‌ పాఠక్‌ ఈ కళాశాలను సందర్శించారు.

Read more