Moderna vaccine: ఒమిక్రాన్ వేరియంట్‌ పనిపట్టే మోడెర్నా టీకాకు యూకే అనుమతి

ABN , First Publish Date - 2022-08-16T01:01:32+05:30 IST

ఇప్పటి వరకు కరోనా వైరస్‌కు మాత్రమే టీకాలు అందుబాటులో రాగా తాజాగా కరోనా వేరియంట ఒమిక్రాన్‌ (Omicron Variant)ను

Moderna vaccine: ఒమిక్రాన్ వేరియంట్‌ పనిపట్టే మోడెర్నా టీకాకు యూకే అనుమతి

లండన్: ఇప్పటి వరకు కరోనా వైరస్‌కు మాత్రమే టీకాలు అందుబాటులో రాగా తాజాగా కరోనా వేరియంట ఒమిక్రాన్‌ (Omicron Variant)ను ఎదిరించే టీకా కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ వేరియంట్ పనిపట్టేలా మోడెర్నా నవీకరించిన టీకా వినియోగానికి యూకే అనుమతులు మంజూరు చేసంది. ఫలితంగా ఒమిక్రాన్ వేరియంట్‌పై పనిచేసే టీకాకు అనుమతులిచ్చిన తొలి దేశంగా యూకే రికార్డులకెక్కింది. పెద్దల కోసం బూస్టర్ డోస్‌గా దీనిని వినియోగించేందుకు యూకే మెడిసిన్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (MHRA) అనుమతులు మంజూరు చేసింది.   


యూఎస్ డ్రగ్ కంపెనీ మోడెర్నా (Moderna vaccine) నవీకరించిన ఈ టీకా భద్రత, నాణ్యత, ప్రభావం యూకే  రెగ్యులేటరీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్టు ఎంహెచ్ఆర్ఏ నిర్ధారించింది. ఇది కరోనా ఒరిజినల్ వైరస్, ఒమిక్రాన్ (BA.1)కు వ్యతిరేకంగా బలమైన రోగనిరోధకశక్తి ప్రతిస్పందనను కనబరిచినట్టు ఎంహెచ్ఆర్ఏ పేర్కొంది. అలాగే ప్రస్తుతం ఆధిపత్యం చూపిస్తున్న ఒమిక్రాన్ బీఎ.4, బీఏ.5లపైనా మంచి ప్రభావం చూపిస్తున్నట్టు వివరించింది. కాగా, యూకేలో ప్రస్తుతం తొలితరం కొవిడ్-19 వ్యాక్సిన్లను మాత్రమే వినియోగిస్తోంది. 

Updated Date - 2022-08-16T01:01:32+05:30 IST