Rath Yatra: ఉడుపి జిల్లా ఆవిర్భావానికి పాతికేళ్లు

ABN , First Publish Date - 2022-08-25T16:53:38+05:30 IST

ఉడుపి జిల్లా ఏర్పాటై ఆగస్టు 25 నాటికి పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఏడా ది పాటు ఉత్సవాలను

Rath Yatra: ఉడుపి జిల్లా ఆవిర్భావానికి పాతికేళ్లు

                                       - నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర


బెంగళూరు, ఆగ స్టు 24 (ఆంధ్రజ్యోతి): ఉడుపి జిల్లా ఏర్పాటై ఆగస్టు 25 నాటికి పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఏడా ది పాటు ఉత్సవాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఉడుపి జిల్లా విశిష్టతను తెలియజేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక రథయాత్రను నిర్వహించనున్నా రు. ఉడుపి నగరంలోని అజ్జర కాడులో రథయాత్రకు గవర్నర్‌ తావర్‌చంద్‌ గెహ్లాట్‌ పచ్చజెండా చూపనున్నారు. అదే రోజు మధ్యాహ్నం బోర్డు హైస్కూల్‌ నుంచి ప్రత్యేక జాతా జరగనుంది. జిల్లా ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు  జిల్లాలో సేవలందించిన రాజకీయ ప్రతినిధులు, అధికారులను రజతమహోత్సవాల సందర్భం గా ఘనంగా సన్మానించనున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఉత్సవాల్లో పాలుపంచుకోవాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. పాతికేళ్ల ఉడుపి మజిలీని కళ్లకు కట్టేలా ప్రత్యేక పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించనున్నారు. వివిధ విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఆలయాలు సహకారంతో ఉడుపి జిల్లాలోని ప్రతి శాసనసభా నియోజకవర్గంలోనూ భవిష్యత్‌ ఉడుపి అనే అంశంపై ప్రత్యేక చర్చాగోష్టులు, సాంస్కృతిక  కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న వి.సునీల్‌కుమార్‌ ఉడుపిలో బుధవారం మీడియాకు చెప్పారు. ఉడుపి రజతోత్సవాల ప్రత్యేక లోగోను కూడా సిద్ధం చేశామన్నారు. జిల్లా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోందని భక్తులను పర్యాటకులను మరింతగా ఆకర్షించే దిశలో పలు కార్యక్రమాలను ఏడాది పొడవునా నిర్వహించే ఆలోచన ఉందని మంత్రి తెలిపారు. రజతోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలను అందజేస్తుందని తెలిపారు.

Updated Date - 2022-08-25T16:53:38+05:30 IST