No permission: సంజయ్‌ రౌత్‌ను జైలులో కలుసుకునేందుకు ఉద్ధవ్‌కు అనుమతి నిరాకరణ

ABN , First Publish Date - 2022-09-07T21:17:34+05:30 IST

శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు ఆర్థర్ రోడ్డు జైలు అధికారుల నుంచి..

No permission: సంజయ్‌ రౌత్‌ను జైలులో కలుసుకునేందుకు ఉద్ధవ్‌కు అనుమతి నిరాకరణ

ముంబై: శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray)కు ఆర్థర్ రోడ్డు జైలు అధికారుల నుంచి చుక్కెదురైంది. మనీ లాండరింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ (Sanjay raut)ను కలుసుకునేందుకు ఉద్ధవ్ థాకరేకు జైలు అధికారులు అనుమతి నిరాకరించారు (Permission Denied). గురుగావ్ శివార్లలోని పాత్రాచాల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో అవకతవకలపై గత ఆగస్టు 1న సంజయ్ రౌత్‌ను ఈడీ అరెస్టు చేసింది.


కాగా, సంజయ్ రౌత్‌ను జైలర్స్ రూమ్‌లో కలుసుకునేందుకు ఉద్ధవ్‌ చేసిన విజ్ఞప్తిని జైలు అధికారులు నిరాకరిస్తూ, దీనిపై కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాలని సూచించారు. ఈ విషయమై అధికారులు మాట్లాడుతూ, సాధారణ ఖైదీలను ఎవరైనా ఎలా కలుసుకోవచ్చో అలాగ కలుసుకోవచ్చని చెప్పారు. సంజయ్ రౌత్ జ్యుడిషియల్ కస్టడీని మరో రెండు వారాల పాటు కోర్టు మంగళవారంనాడు పొడిగించింది. పాత్రా చాల్ అవకతవకలపై సంజయ్ రౌత్ భార్యను, ఆయన అసోసియేట్లను ఇప్పటికే ఈడీ ప్రశ్నించింది. కాగా, తానెలాంటి తప్పూ చేయలేదని సంజయ్ రౌత్ చెబుతున్నారు.

Updated Date - 2022-09-07T21:17:34+05:30 IST