Udayanidhi: రేపు ఉదయనిధి ప్రమాణస్వీకారం

ABN , First Publish Date - 2022-12-13T07:34:11+05:30 IST

ముఖ్యమంత్రి స్టాలిన్‌ తనయుడు ఉదయనిధి(Udayanidhi) మంత్రి పదవి స్వీకరించేందుకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది.

Udayanidhi: రేపు ఉదయనిధి ప్రమాణస్వీకారం

ప్యారీస్‌(చెన్నై), డిసెంబరు 12: ముఖ్యమంత్రి స్టాలిన్‌ తనయుడు ఉదయనిధి(Udayanidhi) మంత్రి పదవి స్వీకరించేందుకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఉదయనిధి డీఎంకే యవజన విభాగం నాయకుడిగా, చేపాక్‌-ట్రిప్లికేన్‌ శాసనసభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి కల్పించాలంటూ మంత్రులంతా ఎప్పటి నుంచో స్టాలిన్‌పై ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 9.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) ఆయన చేత మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఉదయనిధికి యువజన సంక్షేమ శాఖ కేటాయించే అవకాశముందని తెలుస్తోంది. ఆ సందర్భంగా కొంతమంది మంత్రుల శాఖలు కూడా మారే అవకాశాలున్నాయి.

Updated Date - 2022-12-13T07:34:13+05:30 IST