J&K Kupwaraలో ఎన్‌కౌంటర్...ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదుల హతం

ABN , First Publish Date - 2022-06-07T12:55:54+05:30 IST

జమ్మూకశ్మీరులో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు హతమయ్యారు...

J&K Kupwaraలో ఎన్‌కౌంటర్...ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదుల హతం

శ్రీనగర్: జమ్మూకశ్మీరులో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు హతమయ్యారు.మంగళవారం ఉదయం జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు.‘‘నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఎల్‌ఈటీకి చెందిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు పాకిస్తాన్ ఉగ్రవాది తుఫైల్ హతమయ్యారు’’ అని కశ్మీర్ జోన్ పోలీసులు మంగళవారం ట్వీట్ చేశారు.సోమవారం తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాద సంస్థకు చెందిన మరో ఉగ్రవాది హతమయ్యాడు.


ఉగ్రవాది నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పుల్లో ఇద్దరు విదేశీ ఉగ్రవాదులు, ఒక స్థానిక ఉగ్రవాది ఘటనా స్థలం నుంచి పారిపోయారు.పారిపోయిన వారిని పట్టుకునేందుకు పోలీసులు అన్వేషణ కొనసాగిస్తున్నారు.

Read more