ఇద్దరు నకిలీ వైద్యుల అరెస్టు

ABN , First Publish Date - 2022-09-26T17:56:05+05:30 IST

తిరువళ్లూర్‌ జిల్లాలో ఇద్దరు నకిలీ వైద్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరుత్తణి సత్యసాయి నగర్‌కు చెందిన భూపాలన్‌ (50) ప్లస్‌ టూ

ఇద్దరు నకిలీ వైద్యుల అరెస్టు

చెన్నై/ఐసిఎఫ్‌: తిరువళ్లూర్‌ జిల్లాలో ఇద్దరు నకిలీ వైద్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరుత్తణి సత్యసాయి నగర్‌కు చెందిన భూపాలన్‌ (50) ప్లస్‌ టూ వరకు చదివి వైద్యం చేస్తున్నాడు. ఆయనకు సహాయకుడుగా కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన గోపి (40) పనిచేస్తున్నారు. వీరిపై చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ అల్బీజాన్‌ వర్గీ్‌సకు ఫిర్యాదులందాయి. కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు ఆరోగ్యశాఖ అధికారులు, పోలీసులు ఓ ఇంట్లో క్లినిక్‌ నిర్వహిస్తున్న భూపాలన్‌, గోపిలను అరెస్ట్‌ చేసి, ఇంటికి సీలు వేసి, రూ.2 లక్షల విలువైన మందులు స్వాధీనం చేసుకున్నారు.

Read more