encounters: బారాముల్లా,షోపియాన్లలో ఎదురుకాల్పులు
ABN , First Publish Date - 2022-09-30T12:34:47+05:30 IST
జమ్మూకశ్మీరులో(Jammu and Kashmir) శుక్రవారం రెండు ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు(Two encounters) జరిగాయి....
శ్రీనగర్(జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులో(Jammu and Kashmir) శుక్రవారం రెండు ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు(Two encounters) జరిగాయి. బారాముల్లా, షోపియాన్ జిల్లాల్లో(Shopian Baramulla) శుక్రవారం ఉదయం రెండు చోట్ల ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి.ఉత్తర కశ్మీరులోని బారాముల్లా జిల్లా పట్టాన్ ప్రాంతంలో, షోపియాన్ జిల్లా చిత్రాగాం ప్రాంతాల్లో ఉగ్రివాదులున్నారనే సమాచారం మేర శుక్రవారం ఉదయం జమ్మూకశ్మీరు పోలీసులు, కేంద్ర భద్రతాబలగాలతో కలిసి గాలింపు ప్రారంభించారు. పట్టాన్,యెడిపోరా ప్రాంతాల్లో ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు సాగుతున్నాయని కశ్మీరు జోన్ పోలీసులు శుక్రవారం ట్వీట్లు చేశారు. ఈ ఎదురుకాల్పుల్లో ఎంతమంది ఉగ్రవాదులు మరణించారనేది ఇంకా తేలలేదు.