WHO : వైరస్‌ల సునామీ.. భద్రం సుమీ!

ABN , First Publish Date - 2022-12-13T03:08:17+05:30 IST

కరోనా మహమ్మారి ముప్పు తొలగిపోయిందని భరోసాగా ఉన్నారా? తస్మాత్‌ జాగ్రత్త. ‘‘కొవిడ్‌-19, ఫ్లూ, ఆర్‌ఎ్‌సవీ (జలుబు కారక రెస్పిరేటరీ సిన్సిషియల్‌ వైరస్‌) ఇంకా ఇలాంటి

WHO : వైరస్‌ల సునామీ.. భద్రం సుమీ!

డబ్ల్యూహెచ్‌వో నిపుణురాలి హెచ్చరిక

కొవిడ్‌-19, ఫ్లూ, ఆర్‌ఎస్‌వీ సహా పలు వైరస్‌లు

గాలిలో అత్యధిక స్థాయిలో వ్యాపిస్తున్నట్టు వెల్లడి

న్యూయార్క్‌, డిసెంబరు 12: కరోనా మహమ్మారి ముప్పు తొలగిపోయిందని భరోసాగా ఉన్నారా? తస్మాత్‌ జాగ్రత్త. ‘‘కొవిడ్‌-19, ఫ్లూ, ఆర్‌ఎ్‌సవీ (జలుబు కారక రెస్పిరేటరీ సిన్సిషియల్‌ వైరస్‌) ఇంకా ఇలాంటి రకరకాల వైర్‌సలు, సూక్ష్మజీవులు గాలిలో అత్యధిక స్థాయిలో తిరుగుతున్నాయి.. జాగ్రత్తగా ఉండండి’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)కు కొవిడ్‌-19 సాంకేతిక విభాగాధిపతి మరియా వాన్‌ కెర్‌ఖోవ్‌ హెచ్చరించారు. ‘‘ఆయా వైర్‌సల ముప్పు నుంచి మిమ్మల్ని, మీరు ప్రేమించేవారిని కాపాడుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలనూ ఉపయోగించుకోండి. టీకాలు వేయించుకోండి. మాస్కులు ధరించండి, భౌతిక దూరం పాటించండి’’ అని ఆమె సూచించారు. లక్షణాలు కనిపిస్తే ఇంటి వద్దే రాపిడ్‌ టెస్ట్‌ చేసుకోవాలని ఒంట్లో బాగుండకపోతే ఇంటిపట్టునే ఉండాలని, ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చే లా ఏర్పాట్లు చేసుకోవాలని, చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని చెప్పారు. ఈ వైర్‌సల వల్ల ప్రమాదాల గురించి తెలుసుకుని ముప్పును తగ్గించుకోవాలని హితవు చెప్పారు. కొవిడ్‌ ముప్పు ముగిసిపోయిందని అనుకుంటున్నాంగానీ.. ప్రపంచవ్యాప్తంగా ఒమైక్రాన్‌కు సంబంధిత 500 సబ్‌వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నాయని గతవారమే డబ్ల్యూహెచ్‌వో నిపుణుడొకరు హెచ్చరించారు.

Updated Date - 2022-12-13T03:08:17+05:30 IST