మూడు రోజుల పాటు తాజ్‌మహల్‌లోకి పర్యాటకులకు ఉచిత ప్రవేశం

ABN , First Publish Date - 2022-02-23T16:26:46+05:30 IST

తాజ్‌మహల్‌ సందర్శించడానికి ఆగ్రాకు వస్తున్న పర్యాటకులకు పురావస్తుశాఖ శుభవార్త వెల్లడించింది...

మూడు రోజుల పాటు తాజ్‌మహల్‌లోకి పర్యాటకులకు ఉచిత ప్రవేశం

‘ఉర్స్' సందర్భంగా పురావస్తుశాఖ ఆఫర్

ఆగ్రా (ఉత్తరప్రదేశ్):తాజ్‌మహల్‌ సందర్శించడానికి ఆగ్రాకు వస్తున్న పర్యాటకులకు పురావస్తుశాఖ శుభవార్త వెల్లడించింది. ఐదవ మొఘల్ చక్రవర్తి షాజహాన్ 'ఉర్స్' సందర్భంగా ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1వతేదీ వరకు తాజ్‌మహల్‌లోకి పర్యాటకులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.మొఘల్ చక్రవర్తి వర్ధంతి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఈ మినహాయింపు ఇస్తున్నట్లు పురావస్తుశాఖ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్ కుమార్ పటేల్ చెప్పారు. ఫిబ్రవరి 27, 28  మార్చి 1 తేదీల్లో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు తాజ్‌మహల్‌లోకి పర్యాటకులకు ఉచిత ప్రవేశం ఉంటుందని పటేల్ తెలిపారు.తాము కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ పర్యాటకులను అనుమతిస్తున్నామని చెప్పారు.


షాజహాన్ వర్ధంతిని పురస్కరించుకుని ఉర్స్ సందర్భంగా 'చాదర్ పోషి', 'సందల్', 'గుసుల్', 'కుల్' వంటి వివిధ ఆచారాలు పాటిస్తామని టూరిస్ట్ గైడ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షంసుద్దీన్ ఖాన్ చెప్పారు.షాజహాన్, అతని భార్య ముంతాజ్ యొక్క అసలైన సమాధులను చూడటానికి సందర్శకులను నేలమాళిగలోకి ప్రవేశించడానికి సంవత్సరంలో ఒకసారి మాత్రమే అనుమతిస్తామని షకీల్ రఫీక్ అనే టూరిస్ట్ గైడ్ చెప్పారు.


Read more