కాక్‌పిట్‌లో కామకేళి

ABN , First Publish Date - 2022-05-27T06:49:07+05:30 IST

విమానాలు నడపంలో శిక్షణనిచ్చే పైలట్‌ అతడు (28)! ఆమె ట్రైనీ పైలట్‌ (21)!! ఇద్దరూ ఓ రోజు విమానంలో వెళ్తుండగా..

కాక్‌పిట్‌లో కామకేళి

ట్రైనీ పైలట్‌కు ఎక్కువసేపు శిక్షణనిస్తానని ఆశ చూపి శృంగారం


మాస్కో, మే 26: విమానాలు నడపంలో శిక్షణనిచ్చే పైలట్‌ అతడు (28)! ఆమె ట్రైనీ పైలట్‌ (21)!! ఇద్దరూ ఓ రోజు విమానంలో వెళ్తుండగా.. గురువుస్థానంలో ఉన్న ఆ పైలట్‌ ఆమెను కోరరాని కోర్కె కోరాడు. తన కోర్కె తీర్చమని అడిగాడు. అతడు పెళ్లయినవాడు కావడంతో ఆమె అందుకు ససేమిరా అంది. కానీ.. ‘నాతో శృంగారంలో పాల్గొంటే నీకు ఎక్కువ గంటలు శిక్షణ ఇస్తాను’ అని అతడు ఆశ చూపడంతో లొంగిపోయింది. విమానాన్ని ఆటోపైలట్‌ మోడ్‌లో పెట్టి.. ఫోన్‌ కెమెరాను ఆన్‌లో పెట్టి.. ఇద్దరూ గగనతలంలోనే శృంగారవిన్యాసాలు చేశారు. తమ శృంగారాన్ని రికార్డ్‌ చేసుకున్నారు. గాల్లో గప్‌చు్‌పగా జరిగిన ఈ ఘటన అనూహ్యంగా వెలుగుచూసింది. ఆ ట్రైనీ పైలట్‌ తన స్నేహితురాలితో గొడవ పడడంతో.. ఆమె కోపంలో ఈ వీడియోను లీక్‌ చేసేసింది. వీడియో బయటకు రాగానే.. సంబంధిత ఫ్లయింగ్‌ స్కూల్‌ వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఇద్దరినీ స్కూలు నుంచి బహిష్కరించాయి. దీనిపై ట్రైనీపైలట్‌ను ప్రశ్నించగా.. తాము శృంగారంలో పాల్గొనలేదని, ముద్దులు, కౌగిలింతలకే పరిమితమయ్యామని తొలుత ఆమె చెప్పింది. వీడియో బయటపడ్డాక.. అది ఒక్కసారే జరిగిందని.. మరెప్పుడూ తాము అలా చేయలేదని వివరణ ఇచ్చింది.

Read more