terrorist activities: ఐఎస్ఐఎస్‌లో ముస్లిం యువకుల రిక్రూట్‌మెంట్‌

ABN , First Publish Date - 2022-09-24T14:13:43+05:30 IST

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(Popular Front of India) (పీఎఫ్ఐ) నేతల బాగోతం తవ్వేకొద్దీ రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది....

terrorist activities: ఐఎస్ఐఎస్‌లో ముస్లిం యువకుల రిక్రూట్‌మెంట్‌

పీఎఫ్ఐ అగ్ర నేతల పాత్రపై ఇంటెలిజెన్స్‌కు అందిన కీలక సమాచారం 

న్యూఢిల్లీ: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(Popular Front of India) (పీఎఫ్ఐ) నేతల బాగోతం తవ్వేకొద్దీ రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అగ్రనేతలు దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు(radical outfit) నిర్వహించాలనే ఉద్ధేశంతో ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో(terrorist organisation ISIS) భారతీయ ముస్లిం యువకులను(Indian Muslim youths) రిక్రూట్ (recruiting)చేస్తున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగానికి రహస్య సమాచారం అందింది. పీఎఫ్ఐ అగ్రనేతలు, సభ్యులు, ఆఫీస్ బేరర్లు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు విరాళాలు వసూలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రిత్వశాఖకు సమాచారం అందింది. 


బ్యాంకింగ్, హవాలా నెట్‌వర్క్‌ల ద్వారా భారతదేశంతోపాటు విదేశాల నుంచి నిధులు సేకరిస్తున్నారని కేంద్ర ప్రభుత్వానికి విశ్వసనీయ సమాచారం లభించింది. దీంతో పీఎఫ్ఐపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) పోలీసు అధికారులను ఆదేశించారు.ఉగ్రవాద చర్యలకు పాల్పడిన అన్సాద్ బద్రుద్దీన్,మౌద్ అహ్మద్ అనే ఇద్దరు పీఎఫ్‌ఐ సభ్యులకు వివిధ పీఎఫ్‌ఐ ఖాతాల నుంచి నిధులు పొందారని దర్యాప్తులో తేలింది.పీఎఫ్ఐ సభ్యులు ఇతర సభ్యులకు ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు శిక్షణ ఇచ్చారని వెల్లడైంది. 


దేశవ్యాప్తంగా 100 మంది పీఎఫ్ఐ నేతలను ఎన్ఐఏ, ఈడీ అధికారులు ఇటీవల అరెస్టు చేశారు.ప్రత్యేక ఎన్ఐఏ (NIA) కోర్టు ఐదుగురు పీఎఫ్ఐ సభ్యులను సెప్టెంబర్ 26 వరకు మహారాష్ట్ర ఏటీఎస్ కస్టడీకి పంపింది.ఎన్‌ఐఏ పలు కేసుల దర్యాప్తులో ఉగ్రవాద కార్యకలాపాల్లో పీఎఫ్‌ఐ పాత్ర ఉందని నిర్ధారించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జరిపిన సోదాల్లో గత కొన్నేళ్లుగా పీఎఫ్‌ఐ, సంబంధిత సంస్థల ఖాతాల్లో రూ.120 కోట్లకు పైగా జమ అయినట్లు తేలింది.మత సామరస్యానికి భంగం కలిగించే ఉద్దేశ్యంతో పీఎఫ్ఐ సభ్యులు హత్రాస్‌కు వెళ్లారని దర్యాప్తులో వెల్లడైంది.


మతపరమైన అల్లర్లను రెచ్చగొట్టడం, భయాందోళనలు సృష్టించడం, ఉగ్రవాద ముఠా(terror attack)ఏర్పాటుకు ప్లాన్ చేయడం, మారణాయుధాలు, పేలుడు పదార్థాల సేకరణ, సున్నితమైన ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు చేయడంలో పీఎఫ్‌ఐ తన సభ్యుల ద్వారా పాలుపంచుకున్నట్లు ఆధారాలు కూడా కేంద్ర ఏజెన్సీలకు అందాయి.మరో కేసులో ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) పర్యటన సందర్భంగా ఆటంకాలు కలిగించాలనే ఉద్ధేశంతో పీఎఫ్‌ఐ సభ్యులు శిక్షణ పొందారని ఎన్‌ఐఏకు ఆధారాలు లభించాయి.మోదీ హత్యకు వీరు పథకం పన్నారని సమాచారం. దీంతో పీఎఫ్ఐ కార్యకలాపాలపై కేంద్ర సంస్థలతో నిఘా వేయడంతో పాటు ఆ సంస్థను నిషేధించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ(Home Ministry) యోచిస్తున్నట్లు సమాచారం. Read more