Tomatoల దొంగతనమా..!

ABN , First Publish Date - 2022-05-30T17:05:02+05:30 IST

సేలం జిల్లా పెరుమాగౌండంపట్టిలో ఓ దుకాణం వద్ద ఉంచిన 60 కేజీల టమోటాల పెట్టెను అపహరించి స్కూటర్‌లో తరలించిన

Tomatoల దొంగతనమా..!

చెన్నై: సేలం జిల్లా పెరుమాగౌండంపట్టిలో ఓ దుకాణం వద్ద ఉంచిన 60 కేజీల టమోటాల పెట్టెను అపహరించి స్కూటర్‌లో తరలించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ ప్రాంతంలో శంకర్‌ కాయగూరల దుకాణం నడుపుతున్నాడు. రెండు రోజుల క్రితం పార్శిల్‌ లారీ నుండి 60 కేజీల బరువుండే రెండు టమోటాల పెట్టెలను  కార్మికులు  ఆ దుకాణం ముందు దింపి టార్పాలిన్‌ కప్పి వెళ్ళిపోయారు. మరుసటి రోజు శంకర్‌ దుకాణాన్ని తెరిచేందుకు వెళ్ళినప్పుడు ఓ పెట్టె కనిపించలేదు. దీంతో దుకాణం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజి పరిశీలించగా వేకువజామున ఓ వ్యక్తి 60 కేజీల టమోటా పెట్టె అపహరించి దానిని స్కూటర్‌పై ఉంచుకుని పారిపోతున్న దృశ్యం కనిపించింది.


వెంటనే శంకర్‌ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ వీడియోలో నమోదైన స్కూటర్‌ నెంబర్‌ ఆధారంగా టమోటాలను అపహరించుకెళ్ళిన వ్యక్తి వెన్నాందూర్‌ ప్రాంతానికి చెందిన చిన్నరాజ్‌ (32)గా గుర్తించారు. వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్ళి చిన్నరాజ్‌ను అరెస్టు చేిశారు. పోలీసుల విచారణలో చిన్నరాజ్‌ గతంలో సేలం నగరంలో పలు కూరగాయాల దుకాణాల వద్ద ఇదే విధంగా చోరీలకు పాల్పడి అరెస్టయి బెయిలుపై వచ్చినట్టు తెలుసుకున్నారు.

Updated Date - 2022-05-30T17:05:02+05:30 IST