రేపు సంపూర్ణ Lockdown

ABN , First Publish Date - 2022-01-22T13:31:31+05:30 IST

రాష్ట్రంలో కరోనా, ఒమైక్రాన్‌ వైరస్‌ల వ్యాప్తి అధికమవుతున్న నేపథ్యంలో వచ్చే ఆదివారం కూడా సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల

రేపు సంపూర్ణ Lockdown

ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రంలో కరోనా, ఒమైక్రాన్‌ వైరస్‌ల వ్యాప్తి అధికమవుతున్న నేపథ్యంలో వచ్చే ఆదివారం కూడా సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 16 అమలు చేసిన అన్ని నిబంధనలతో ఈ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని పేర్కొన్నారు. దుకాణాలన్నింటినీ మూసివేయాలని, అంబు లెన్సులు, వైద్యులు ప్రయాణించే అత్యవసర వాహనాలు మినహా తక్కిన వాహనాలేవీ సంచరించకూడదని తెలిపారు. అదే సమయంలో పొరుగు రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రైలు, బస్సు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా సెంట్రల్‌, ఎగ్మూరు రైల్వేస్టేషన్లలో కోయంబేడు బస్‌స్టేషన్‌, మదురై, కోయంబత్తూరు తదితర నగరాల్లోని రైల్వేస్టేషన్లు, బస్‌ స్టేషన్లలో ఆటోలు, టాక్సీలు నడిపేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రయాణికులు తమ వద్ద టికెట్లు పెట్టుకుని ఆటోలు, టాక్సీలు, అద్దె వాహనాల్లో వెళ్ళాల్సి ఉంటుందని స్టాలిన్‌ పేర్కొన్నారు. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న కారణంగా రాష్ట్రప్రభుత్వం ఈ నెల 9, 16 తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించింది. అదే విధంగా వచ్చే ఆదివారం కూడా సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని,  పొరుగూళ్ల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికుల సంక్షేమార్ధం అన్ని రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లలో ఆటో సేవలను అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2022-01-22T13:31:31+05:30 IST