Indian Railways: రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ షాక్

ABN , First Publish Date - 2022-09-07T13:28:10+05:30 IST

దేశంలో రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ(Indian Railways) షాక్ ఇచ్చింది....

Indian Railways: రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ షాక్

బుధవారం ఒకేరోజు 173 రైళ్ల రద్దు

న్యూఢిల్లీ : దేశంలో రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ(Indian Railways) షాక్ ఇచ్చింది. బుధవారం ఒక్కరోజే దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రాకపోకలు సాగించాల్సిన 173 రైళ్లను రద్దు(cancels) చేసింది. రైళ్ల నిర్వహణ(maintenance issues), మరమ్మతుల పేరుతో బుధవారం నాడు(today) ఏకంగా 173 రైళ్లను రద్దు చేయడంతో రైల్వే ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది.(maintenance and operational concerns)దీంతోపాటు మరో 35 రైళ్లను గమ్యస్థానాల స్టేషన్లను మారుస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరో 9 రైళ్ల సమయాలను రీ షెడ్యూల్(rescheduled) చేశారు. బుధవారమే కాకుండా గురువారం (సెప్టెంబరు8) కూడా పలు రైళ్లను రద్దు చేసే అవకాశాలున్నాయని రైల్వే అధికారులు చెప్పారు. 


మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, న్యూఢిల్లీ, జమ్మూకశ్మీర్, పశ్చిమబెంగాల్, అసోం, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, బిహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రాకపోకలు సాగించే రైళ్లను రద్దు చేశారు. రద్దు చేసిన రైళ్ల వివరాలను రైల్వే ప్రయాణికుల సమాచారం కోసం రైల్వే వెబ్‌సైట్‌లో ఉంచామని రైల్వే అధికారులు చెప్పారు.మొత్తంమీద నిర్వహణ పేరిట తరచూ రైల్వేశాఖ రైళ్లను రద్దు చేస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 

Updated Date - 2022-09-07T13:28:10+05:30 IST