నేడు Bengaluru డబుల్‌ డెక్కర్‌ రద్దు

ABN , First Publish Date - 2022-07-13T14:37:19+05:30 IST

బదర్‌పూర్‌ సెక్షన్‌ పరిధిలోని రైల్వే లైన్‌లో మరమ్మతుల కారణంగా బుధవారం చెన్నై - బెంగళూరు మధ్య తిరిగే కొన్ని రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు

నేడు Bengaluru డబుల్‌ డెక్కర్‌ రద్దు

చెన్నై, జూలై 12 (ఆంధ్రజ్యోతి): బదర్‌పూర్‌ సెక్షన్‌ పరిధిలోని రైల్వే లైన్‌లో మరమ్మతుల కారణంగా బుధవారం చెన్నై - బెంగళూరు మధ్య తిరిగే కొన్ని రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు దక్షిణరైల్వే ప్రకటన విడుదల చేసింది. పూర్తిగా రద్దయిన రైళ్ల వివరాలిలా..

- చెన్నై సెంట్రల్‌ - క్రాంతివీర్‌ సంగోలి రాయన్న (బెంగళూరు) డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ (22625) - (13.07.2022)

- క్రాంతివీర్‌ సంగోలి రాయన్న (బెంగళూరు) - చెన్నై సెంట్రల్‌ డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ (22626) - (13.07.2022)

- అగర్తల - బెంగళూరు కంటోన్మెంట్‌ హంసఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ (వయా పెరంబూర్‌ - కాట్పాడి) (12504) - (ఈ నెల 16, 23, 30 తేదీల్లో)

- బెంగళూరు కంటోన్మెంట్‌ - అగర్తల హంసఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ (వయా కాట్పాడి- పెరంబూర్‌) (12503) - ఈ నెల 19, 26, ఆగస్టు 2 తేదీల్లో)

పాక్షికంగా రద్దయిన రైళ్ల వివరాలు:

- బుధవారం ఉదయం 7.40 గంటలకు బయలుదేరే చెన్నై సెంట్రల్‌ - క్రాంతివీర సంగొల్లి రాయన్న (బెంగళూరు) బృందావన్‌ ఎక్స్‌ప్రెస్‌ (12639) జోలార్‌పేట వరకే వెళ్తుంది.

- బుధవారం మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరాల్సిన బృందావన్‌ ఎక్స్‌ప్రెస్‌ (12640) సాయంత్రం 5.10 గంటలకు జోలార్‌పేట నుంచి బయలుదేరుతుంది.


Updated Date - 2022-07-13T14:37:19+05:30 IST