Special train: తిరువనంతపురం - తాంబరం మధ్య ప్రత్యేక రైలు

ABN , First Publish Date - 2022-10-03T15:24:00+05:30 IST

తిరువనంతపురం నుంచి తాంబరంకు నాగర్‌కోయిల్‌ మీదుగా ప్రత్యేక రైలును నడుపనున్నట్టు దక్షిణ రైల్వే తిరువనంతపురం(Thiruvananthapuram)

Special train: తిరువనంతపురం - తాంబరం మధ్య ప్రత్యేక రైలు

అడయార్‌(చెన్నై), అక్టోబరు 2: తిరువనంతపురం నుంచి తాంబరంకు నాగర్‌కోయిల్‌ మీదుగా ప్రత్యేక రైలును నడుపనున్నట్టు దక్షిణ రైల్వే తిరువనంతపురం(Thiruvananthapuram) డివిజన్‌ అధికారులు ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 06054 నంబరు రైలు ఈ నెల 5న తిరువనంతపురం సెంట్రల్‌ స్టేషన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు మధ్యాహ్నం 12.43 గంటలకు కళిత్తురై, మధ్యాహ్నం 14.10కు నాగర్‌కోయిల్‌కు చేరుకుంటుంది. అక్కడ నుంచి వళ్ళియూరు, తిరునెల్వేలి, కోవిల్‌పట్టి, విరుదునగర్‌, అరుబ్బుకోట, మానామదురై, శివగంగై, కారైక్కుడి, పుదుక్కోట, తిరుచ్చి, తంజావూరు, కుంభకోణం, మైలాడుదురై, చిదంబరం, విల్లుపురం, చెంగల్పట్టు మీదుగా తాంబరంకు మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 06053 నంబరు రైలు తాంబరంలో 6వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.40 గంటలకు తిరువనంతపురం సెంట్రల్‌కు చేరుకుంటుంది.

Updated Date - 2022-10-03T15:24:00+05:30 IST