తిరుత్తణిలో కారు దగ్ధం

ABN , First Publish Date - 2022-05-30T17:21:20+05:30 IST

తిరువళ్లూరు - తిరుత్తణి మార్గంలోని పుదూరు గ్రామం వద్ద శనివారం రాత్రి వేగంగా వెళ్తున్న ఓ కారు హఠాత్తుగా దగ్ధమైంది. ఆ కారులో ప్రయాణించిన దంపతులు సకాలంలో

తిరుత్తణిలో కారు దగ్ధం

దంపతులకు తప్పిన ముప్పు

చెన్నై: తిరువళ్లూరు - తిరుత్తణి మార్గంలోని పుదూరు గ్రామం వద్ద శనివారం రాత్రి వేగంగా వెళ్తున్న ఓ కారు హఠాత్తుగా దగ్ధమైంది. ఆ కారులో ప్రయాణించిన దంపతులు సకాలంలో తలుపులు తెరచుకుని బయటపడటంతో ప్రాణగండం నుండి తప్పించుకున్నారు. తిరుత్తణి సుబ్రమణ్యనగర్‌లో నివసిస్తున్న రాజేశ్‌కుమార్‌ (45),, ఆషా (40) అనే భార్యాభర్తలు శనివారం రాత్రి తిరువళ్లూరుకు వెళ్ళి   స్వస్థలానికి బయల్దేరారు. వారి కారు పుదూరు గ్రామం వద్ద వెళుతుండగా ఇంజన్‌ నుంచి  పొగలు రేగాయి. కారు నడుపుతున్న రాజేశ్‌కుమార్‌ అది చూసి దిగ్ర్భాంతి చెందారు. వెంటనే కారు నిలిపి డోర్‌ తెరచుకుని భార్యాభర్తలు ఇద్దరూ బయపడ్డారు. కాసేపటికల్లా ఆ కారు మంటల్లో దగ్ధమైంది. ఈ సమాచారం తెలుసుకుని కనకమ్మసత్రం పోలీసులు అగ్నిమాపక సిబ్బంది తో అక్కడికి వెళ్ళారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Read more