యువతిని గొంతు కోసి చంపి.. వీడియో తీసి!

ABN , First Publish Date - 2022-11-17T03:49:17+05:30 IST

తనతో సహజీవనం చేస్తున్న యువతిని ఢిల్లీలో ఓ యువకుడు ముక్కలు ముక్కలుగా నరికిన దారుణం మరువక ముందే మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో మరో ఘోరం వెలుగుచూసింది.

యువతిని గొంతు కోసి చంపి.. వీడియో తీసి!

స్వర్గంలో కలుద్దాం డియర్‌ అని పోస్ట్‌.. మధ్యప్రదేశ్‌లో దారుణం

జబల్‌పూర్‌, నవంబరు 16: తనతో సహజీవనం చేస్తున్న యువతిని ఢిల్లీలో ఓ యువకుడు ముక్కలు ముక్కలుగా నరికిన దారుణం మరువక ముందే మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో మరో ఘోరం వెలుగుచూసింది. ఓ వ్యక్తి, యువతిని గొంతు కోసి చంపి.. ఆమె మృతదేహాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఆ ఫొటో కింద.. ‘‘విశ్వాసఘాతుకానికి పాల్పడకూడదు. డియర్‌.. మళ్లీ స్వర్గంలో కలుద్దాం’’ అని రాశాడు! నిందితుడి పేరు అభిజిత్‌ పటీదార్‌. శిల్పా జరియా అనే 25 ఏళ్ల యువతిని హత్య చేశాడు. తన సహవ్యాపారి అయిన జితేందర్‌తో శారీరక సంబంధం పెట్టుకొని మోసం చేసిందని, జితేందర్‌ సూచన మేరకే హత్య చేశానని అభిజిత్‌ చెప్పాడు.

Updated Date - 2022-11-17T03:49:22+05:30 IST

Read more