తెల్ల పులికి బుజ్జి కూన

ABN , First Publish Date - 2022-11-08T03:10:33+05:30 IST

మైత్రిబగ్‌ జూలో ఓ తెల్ల పులి ఒక బుజ్జి కూనకు జన్మనిచ్చింది. సెప్టెంబరు 5న రోమా అనే తెల్ల పులికి మగ కూన పుట్టింది.

తెల్ల పులికి బుజ్జి కూన

ఛత్తీ్‌సగఢ్‌ జూలో జననం

దుర్గ్‌, నవంబరు 7: ఛత్తీ్‌సగఢ్‌లోని మైత్రిబగ్‌ జూలో ఓ తెల్ల పులి ఒక బుజ్జి కూనకు జన్మనిచ్చింది. సెప్టెంబరు 5న రోమా అనే తెల్ల పులికి మగ కూన పుట్టింది. దీనికి సింగం అని పేరు పెట్టారు. ఈ రెండింటినీ రెండు నెలలుగా క్వారంటైన్‌లో ఉంచారు. సింగం పుట్టుకతో జూలోని తెల్ల పులల సంఖ్య ఏడుకు చేరింది. అందులో ఐదు మగ, రెండు ఆడవి ఉన్నాయి. కరోనా కారణంగా ఆపేసిన తెల్ల పులల పెంపకం ఆరు నెలల క్రితం తిరిగి ప్రారంభించిన ట్లు జూ ఇన్‌చార్జి ఇన్‌ కే జైన్‌ తెలిపారు.

Updated Date - 2022-11-08T03:10:33+05:30 IST

Read more