‘జ్ఞానవాపి’పై విచారణ మళ్లీ మొదటికి

ABN , First Publish Date - 2022-05-24T09:11:39+05:30 IST

వారాణసీలోని జ్ఞానవాపి మసీదు సర్వే కేసు విచారణ మళ్లీ మొదటికి వచ్చింది.

‘జ్ఞానవాపి’పై విచారణ మళ్లీ మొదటికి

వారాణసీ, మే 23: వారాణసీలోని జ్ఞానవాపి మసీదు సర్వే కేసు విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. సుప్రీం ఆదేశాల మేరకు దీనిపై తాజాగా వాదనలు విననున్నట్టు వారాణసీ కోర్టు సీనియర్‌ మోస్ట్‌ జడ్జి తెలిపారు. అయితే ఎప్పటి నుంచి వాదనలు వినేదీ మంగళవారం నిర్ణయిస్తామని చె ప్పారు. ఇక సోమవారం నాటి విచారణను అత్యంత గోప్యంగా చేపట్టారు. కోర్టులోకి 23 మందినే అనుమతించారు. ముస్లిం సంఘాల అభ్యంతరం నేపథ్యంలో కోర్టు నియమించిన కమిషనర్‌నూ అనుమతించలేదు.

Read more