తలాక్‌పై వ్యాజ్యాలను స్వీకరించిన సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2022-10-12T07:44:23+05:30 IST

తలాక్‌-ఎ-హసన్‌ సహా ఇతర ఏకపక్ష విడాకుల విధానాలను రాజ్యాంగ వ్యతిరేకమైనవిగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను మంగళవారం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

తలాక్‌పై వ్యాజ్యాలను స్వీకరించిన సుప్రీంకోర్టు

తలాక్‌-ఎ-హసన్‌ సహా ఇతర ఏకపక్ష విడాకుల విధానాలను రాజ్యాంగ వ్యతిరేకమైనవిగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను మంగళవారం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వీటిపై విచారణ జరపనుంది. నెలకు ఒకసారి చొప్పున వరుసగా మూడు నెలల పాటు తలాక్‌ చెబితే దాన్ని తలాక్‌-ఎ-హసన్‌గా వ్యవహరిస్తారు. మూడోసారి తలాక్‌ చెబితే విడాకులు మంజూరవుతాయి.  

Read more