సిరీస్‌ ఆసీస్‌ వశం

ABN , First Publish Date - 2022-11-23T03:19:45+05:30 IST

ఓపెనర్లు హెడ్‌ (152), డేవిడ్‌ వార్నర్‌ (106) శతకాలతో అదరగొట్టడంతో.. ఇంగ్లండ్‌తో వర్షప్రభావి త మూడో, ఆఖరి వన్డేలో ఆతిథ్య ఆస్ట్రేలియా 221 పరుగులు (డ/లూ పద్ధతి)లో నెగ్గింది.

సిరీస్‌ ఆసీస్‌ వశం

మెల్‌బోర్న్‌: ఓపెనర్లు హెడ్‌ (152), డేవిడ్‌ వార్నర్‌ (106) శతకాలతో అదరగొట్టడంతో.. ఇంగ్లండ్‌తో వర్షప్రభావి త మూడో, ఆఖరి వన్డేలో ఆతిథ్య ఆస్ట్రేలియా 221 పరుగులు (డ/లూ పద్ధతి)లో నెగ్గింది. మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. వర్షం కారణంగా 48 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత ఆసీస్‌ 5 వికెట్లకు 355 పరుగులు చేసింది. ఓలీ స్టోన్‌ 4 వికెట్లు పడగొట్టాడు. అయితే, డ/లూ పద్ధతిలో బట్లర్‌ సేన లక్ష్యాన్ని 48 ఓవర్లలో 364 రన్స్‌గా నిర్దేశించారు. ఛేదనలో ఇంగ్లండ్‌ 31.4 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది. ఆడమ్‌ జంపా 4 వికెట్లు తీశాడు.

Updated Date - 2022-11-23T08:44:13+05:30 IST

Read more