‘దగ్గుమందు’ను నిలిపేసిన భారతీయ కంపెనీ

ABN , First Publish Date - 2022-12-30T01:02:34+05:30 IST

ఉజ్బెకిస్థాన్‌లో 8 మంది చిన్నారుల మరణానికి కారణంగా భావిస్తున్న దగ్గుమందు ఉత్పత్తిని భారతీయ ఔషధ సంస్థ మారియన్‌ బయోటెక్‌ నిలిపివేసింది.

‘దగ్గుమందు’ను నిలిపేసిన భారతీయ కంపెనీ

ఉజ్బెక్‌లో 18 మంది మరణంపై నోయిడా కంపెనీలో దర్యాప్తు

న్యూఢిల్లీ, డిసెంబరు 29: ఉజ్బెకిస్థాన్‌లో 8 మంది చిన్నారుల మరణానికి కారణంగా భావిస్తున్న దగ్గుమందు ఉత్పత్తిని భారతీయ ఔషధ సంస్థ మారియన్‌ బయోటెక్‌ నిలిపివేసింది. డాక్‌ 1 మ్యాక్స్‌ ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు గురువారం కంపెనీ న్యాయవాది ప్రకటించారు. మరోపక్క కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎ్‌ససీవో) 18 మంది మరణంపై తన దర్యాప్తును ప్రారంభించింది. నోయిడాలోని కంపెనీ ఫ్యాక్టరీని అధికారులు సందర్శించిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని ఆరోగ్య మంత్రి మన్సుక్‌ మాండవీయ ప్రకటించారు. ఫ్యాక్టరీలో తనిఖీలు ప్రారంభమైనట్లు ఉత్తరప్రదేశ్‌ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-12-30T01:02:35+05:30 IST