యూపీలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయం: మాయావతి

ABN , First Publish Date - 2022-01-23T20:44:06+05:30 IST

కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంలో ప్రియాంక గాంధీ వాద్రా కొద్ది గంటల్లోనే మాటమార్చడం చూస్తే ..

యూపీలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయం: మాయావతి

లక్నో: కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంలో ప్రియాంక గాంధీ వాద్రా కొద్ది గంటల్లోనే మాటమార్చడం చూస్తే ఆ పార్టీ  పరిస్థితి అర్ధం చేసుకోవచ్చని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ చీఫ్ మాయావతి అన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీయేతర ఓట్లను మాత్రమే చీల్చుకుంటుందని, ఆ పార్టీకి ఓటు వేసి విలువైన ఓటును వృధా చేసుకోవద్దని, ఏకపక్షంగా బీఎస్‌పీకి ప్రజలంతా ఓటువేయాలని అదివారంనాడు వరుస ట్వీట్లలో మాయావతి కోరారు.


యూపీ ఎన్నికల్లో మాయావతి ఈసారి పోటీ చేయడం లేదు. అయితే, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మాత్రం కర్హల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. బీజేపీ ఇప్పటికే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. 403 మంది సభ్యుల యూపీ అసెంబ్లీకి 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10న తొలి విడత పోలింగ్ ప్రారంభమై మార్చి 7న చివరి విడత పోలింగ్‌తో ముగుస్తుంది. తొలి విడతలో 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

Updated Date - 2022-01-23T20:44:06+05:30 IST