ఆ కోటు ధరించిన వ్యక్తిని మనిషిగా గుర్తించని కెమెరాలు

ABN , First Publish Date - 2022-12-10T01:17:11+05:30 IST

జానపదకథల్లో మాయ జలతారు గురించి వినే ఉంటారు. అదో రకం ముసుగు. అది కప్పుకోగానే మాయమైపోతారన్నమాట.

ఆ కోటు ధరించిన వ్యక్తిని మనిషిగా గుర్తించని కెమెరాలు

చైనా విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ

జానపదకథల్లో మాయ జలతారు గురించి వినే ఉంటారు. అదో రకం ముసుగు. అది కప్పుకోగానే మాయమైపోతారన్నమాట. అలాంటి దుస్తులను తయారుచేయడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది శాస్త్రజ్ఞులు చాలాకాలంగా కృషిచేస్తున్నారు. మరీ పూర్తిగా మాయం చేసే దుస్తులు కాదుగానీ.. కృత్రిమ మేధ (ఏఐ)తో పని చేసే సెక్యూరిటీ కెమెరాల కళ్లుగప్పే కోటునొకదాన్ని చైనాలోని వూహాన్‌ యూనివర్సిటీ విద్యార్థులు ఇటీవల ఓ పోటీలో భాగంగా తయారుచేసి ఫస్ట్‌ ప్రైజు కొట్టారు. ఆ కోటు పేరు.. ‘ఇన్‌వి్‌సడిఫెన్స్‌’. ఏఐతో పనిచేసే సీసీ కెమెరాలు ఉన్న చోటుకు ఈ కోటు ధరించి వెళ్తే.. అది పగలైనా, రాత్రైనా.. కెమెరాలు ఆ వ్యక్తి కదలికలను గుర్తిస్తాయిగానీ, మనిషిగా గుర్తించవు. సాధారణంగా ఏఐతో పనిచేసే కెమెరాలు పగటిపూట మనుషులను వారు ధరించే దుస్తులపై ఉండే ప్యాటర్న్‌ ఆధారంగా, రాత్రిపూట అయితే మనుషుల శరీరంలోని వేడి ఆధారంగా గుర్తిస్తాయి. ఈ నేపథ్యంలో చైనా విద్యార్థులు.. కృత్రిమ మేధను పగటిపూట మోసం చేసే ప్యాటర్న్‌ను, రాత్రిపూట దాని కళ్లుగప్పేలా ఉష్ణ నియంత్రణ మాడ్యూళ్లను కోటులో అమర్చారు.

Updated Date - 2022-12-10T10:08:33+05:30 IST