తెలంగాణ విముక్తి దినోత్సవం అధికారిక నిర్వహణపై ప్రధానికి ధన్యవాదాలు

ABN , First Publish Date - 2022-10-03T09:17:40+05:30 IST

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా..

తెలంగాణ విముక్తి దినోత్సవం అధికారిక నిర్వహణపై ప్రధానికి ధన్యవాదాలు

75 మంది తెలంగాణ మేధావుల లేఖ

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 2(ఆంధ్రజ్యోతి): ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా.. నిజాం పాలన నుంచి హైదరాబాద్‌ సంస్థానం విముక్తి పొందిన సెప్టెంబర్‌ 17న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ‘తెలంగాణ విమోచన ఉత్సవాలు’ నిర్వహించడంపై ప్రధానిమోదీకి  తెలంగాణ మేధావులు ఆదివారం లేఖ ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు. 75 మంది మేధావులు, ప్రొఫెసర్లు ఆ లేఖపై సంతకాలు చేశారు. విమోచన దినోత్సవాన్ని ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించాలని కోరారు. 

Read more